కాకతీయ విశ్వవిద్యాలయముతెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో ఉన్న పబ్లిక్ విశ్వవిద్యాలయము. తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో రెండవ అతి పెద్ద విశ్వవిద్యాలయము. ఈ విశ్వవిద్యాలయములో దాదాపు 120 విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ విశ్వవిద్యాలయ పరిధిలోకి నాలుగు జిల్లాలు (వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్) వస్తాయి.[1]
వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్: వరంగల్ లోని సుబేదారి ప్రాంతంలో ఉన్న పురాతన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల. దీనిని కాకతీయ విశ్వవిద్యాలయపు రెండవ ప్రాంగణం అని కూడా పిలుస్తారు.