కాజల్ జైన్

కాజల్ జైన్
జననం (1985-09-10) 1985 సెప్టెంబరు 10 (age 39)
గ్వాలియర్, మధ్యప్రదేశ్, భారతదేశం
వృత్తిమోడల్, నటి, కళాకారిణి
క్రియాశీలక సంవత్సరాలు2008–ప్రస్తుతం

కాజల్ జైన్ (జననం 1985 సెప్టెంబరు 10) ఒక భారతీయ మోడల్, నటి.[1][2] ఆమె 2008లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొంది. అక్కడ టాప్ 10 ఫైనలిస్టులలో ఒకరిగా ఆమె నిలిచింది. టాప్ మోడల్ ఆఫ్ ది వరల్డ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమె ఆర్య బబ్బర్, యువరాజ్ హన్స్ లతో కలిసి పంజాబీ చిత్రం యార్ అన్ముల్లే (2011)లో తెరంగేట్రం చేసింది.[3]

కెరీర్

[మార్చు]

2011లో ఆర్య బబ్బర్, యువరాజ్ సింగ్ లతో కలిసి పంజాబీ చిత్రం యార్ అన్ముల్లే (2011)లో కాజల్ ప్రధాన పాత్ర పోషించింది. ఆ తరువాత, ఆమె ఇంద్రజిత్ నిక్కు, కరణ్ కుంద్రా నటించిన మేరే యార్ కమినే (2013), అర్జన్ బజ్వా తో కలిసి హిమ్మత్ సింగ్ (2014)లో నటించింది. ఈ చిత్రాలతో పాటు బుద్ధ, సింహాసన్ బత్తిసి వంటి భారతీయ టెలివిజన్ షోలలో కూడా కాజల్ కనిపించింది.[4] ఆమె శామ్సంగ్, బ్లూ స్టార్, నోకియా, తనిష్క్, సంతూర్, హ్యుందాయ్, సింథోల్ వంటి ఉత్పత్తుల కోసం అనేక బాలీవుడ్ నటులతో కలిసి వాణిజ్య ప్రకటనలలో నటించింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనిక
2011 యార్ అన్ముల్లే అమన్ పంజాబీ
2013 బడే చంగే నే మేరే యార్ కమీనే రంజితా పంజాబీ
2014 హిమ్మత్ సింగ్ పంజాబీ
2018 ఎక్కీస్ తరీఖ్ శుభ్ ముహురత్ రాధ హిందీ

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం సీరియల్ పాత్ర ఛానల్ గమనికలు
2013–2014 బుద్ధ మహారాణి యశోధర జీ టీవీ ప్రధాన పాత్ర
2014–2015 సింహాసన్ బత్తిసి [5] మహారాణి చిత్రలేఖ సోనీ పాల్
2015 బేతాళ్ ఔర్ సింహాసన్ బతిసీ సోనీ ఎస్ఏబీ
కోడ్ రెడ్ ఎపిసోడ్ 145 కలర్స్ టీవీ ఎపిసోడిక్ పాత్ర
యామ్ హై హమ్ నందిని శోభవతి సోనీ ఎస్ఏబీ సహాయక పాత్ర
2016 జమాయి రాజా జీ టీవీ కామియో పాత్ర
భక్తోన్ కి భక్తి మే శక్తి మైథిలి (ఎపిసోడ్ 29) లైఫ్ ఓకే ఎపిసోడిక్ పాత్ర
2017 ఆయుష్మాన్ భవ సమైరా విక్రాంత్ సింఘానియా స్టార్ భారత్ ప్రతికూల పాత్ర
2019 తెనాలి రామ చిత్రాంగద సోనీ ఎస్ఏబీ కామియో పాత్ర
నమస్ మోహిని స్టార్ ప్లస్
2020 శ్రీమద్ భగవత్ మహాపురన్ శూర్పనఖా (ఎపిసోడ్ 33) కలర్స్ టీవీ ఎపిసోడిక్ పాత్ర
అల్లాదీన్-నామ్ తో సునా హోగా మెహజబీన్ సోనీ ఎస్ఏబీ కామియో పాత్ర
2023–2024 కర్మధికారి షానిదేవ్ దేవి పార్వతి షెమారూ టీవీ సహాయక పాత్ర
2024 కుండలి భాగ్య అలియా మల్హోత్రా జీ టీవీ

మూలాలు

[మార్చు]
  1. "Happy bday to me wid besties..." Instagram Dot Com (in ఇంగ్లీష్). 2014-09-10. Archived from the original on 2023-04-15. Retrieved 2020-03-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Happy birthday Kajal". Instagram Dot Com (in ఇంగ్లీష్). 2017-09-10. Archived from the original on 26 December 2021. Retrieved 2020-03-11.
  3. "Kajal Jain". tellychakkar.com.
  4. "Miss India finalist makes her TV debut". Times of India.
  5. "Sinhasan Battisi actress Kajal Jain to study scriptwriting in Los Angeles". The Times of India. 2014-12-01. ISSN 0971-8257. Retrieved 2024-11-30.