కాజీపేట | |
---|---|
రెవెన్యూ గ్రామం | |
Coordinates: 17°58′00″N 79°30′00″E / 17.96667°N 79.50000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
Government | |
• Body | వరంగల్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ | 506003 [1] |
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | 0870 |
Vehicle registration | TS–03 |
కాజీపేట, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, కాజీపేట మండలం లోని గ్రామం.[2] భారతదేశం లోని ముఖ్యమైన రైల్వేస్టేషన్లులో కాజీపేట రైల్వేస్టేషన్ ఒకటి. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని హన్మకొండ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ పట్టణ జిల్లాలో, కొత్తగా ఏర్పాటు చేసిన కాజీపేట మండలం (హన్మకొండ జిల్లా) లోకి చేర్చారు.[3][4] ఆ తరువాత 2021 లో, వరంగల్ పట్టణ జిల్లా స్థానంలో హనుమకొండ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.[4]
లోగడ కాజీపేట గ్రామం వరంగల్ జిల్లా, వరంగల్ రెవెన్యూ డివిజను పరిధిలోని హన్మకొండ మండలానికి చెందింది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత, మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా కాజీపేట గ్రామాన్ని (1+09) పది గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా, కొత్తగా ఏర్పడిన వరంగల్ పట్టణ జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[5]
ఇది ఉత్తర, దక్షిణ భారతదేశాలను కలిపే ముఖ్యమైన రైల్వే జంక్షన్.1929 లో కాజీపేట - బల్హర్షా లింక్ పూర్తయిన తరువాత, చెన్నై నుండి నేరుగా డిల్లీ వెళ్లుటకు అనుసంధానించబడింది.
వాడీ - సికింద్రాబాద్ లైన్‌ను 1874 లో హైదరాబాదు నిజాంచే నిర్మించబడింది. ఇది తరువాత నిజాం స్టేట్ రైల్వేలో భాగమైంది. 1889 లో నిజాం స్టేట్ రైల్వే ప్రధాన మార్గం విజయవాడ వరకు విస్తరించబడింది.
డోర్నకల్-కాజీపేట్ 1988-89లో, 1987-88లో కాజీపేట-రామగుండం, 1991-93లో కాజీపేట-సికింద్రాబాద్ రైల్వే మార్గాలను విద్యుదీకరించారు.
ఈ గ్రామంలో శ్వేతార్కమూల గణపతి దేవాలయం ఉంది.