కానుగ నూనె

కానుగ చెట్టు
పూలగుచ్ఛము
పుష్పము

కానుగ చెట్టు గింజలనుండి ఉత్పత్తగు శాక నూనె (Vegetable oil), ఈనూనె ఆహరయోగ్యం కాదు. కానుగచెట్టు వృక్షశాస్త్రనామం, పొంగమియ పిన్నాటా (pongamia pinnata). ఫాబేసి/ కుటుంబం, పాపిలినేసి ఉపకుటుంబానికి చెందినది.[1] హిందిలో 'కరంజ' అని, ఆంగ్లంలో ఇండియన్‌ బీచ్‌ట్రీ అని అంటారు. వందలాది సంవత్సరాల క్రితమే, భారతదేశంలో ఆయూర్వేదం, సిద్దవైద్యంలో కానుగ చెట్టు యొక్క భాగాలను ఉపయోగించెవారు. చెట్టు యొక్క ఆకులను, పూలను, గింజలను, బెరడు, వేరు యొక్క అన్ని భాగాలను వివిధ రకాల దేహరుగ్మతల నివారణ మందుల తయారిలో ఉపయోగించెవారు.[2]

భారత భాషల్లొ కానుగ సాధారణ పేరు[3][4]

[మార్చు]

భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్, హర్యానా, కర్నాటక, మధ్య ప్రదేశ్, ఒడిస్సా, రాజస్తాన్,, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు నూనెకై కానుగ తోటలను పెంచుటకు అనుకూలమైనవి.

కానుగ చెట్టు

[మార్చు]

కానుగ చెట్టును రహదారులకు పక్కన, ఇంటి ఆవరణలో, పార్కులలో, బయలు ప్రదేశాలలో, చెరువుల, కాలువల గట్లమీద, కార్యాలయాల, వైద్యశాలల, కాలేజిల ఆవరణలలో పెంచెదరు. దీనిని ముఖ్యంగా నీడ నిచ్చు చెట్టుగా నాటెదరు. కానుగ చెట్టూ ఎత్తు మధ్యస్దంగా పెరుగుతుంది, 6-12 మీ.ఎత్తు (కొన్ని 20-25 మీటర్లు) పెరుగును. ఏపుగాపెరిగిన చెట్టు కాండం వ్యాసం 50 సెం.మీ. వరకు వుండును. పూలు పింకు, తెలుపు, పర్పుల్‌ రెడ్‌రంగులో వుండును. చెట్టు6-7 సం నుండి పుష్పించడం మొదలగును. పూలు ఏప్రిల్‌-మే నెలలో పుష్పించును.[5] కాయలు జూన్-జులైలో ఏర్పడును. కాయ పొడవు 4.5-6 సెం.మీ, వెడల్పు 2-2.5 సెం.మీ, మందం.5-.6 సెం.మీ వుండిబాదం పప్పును పోలి అండాకారంగా వుండును. కాయలోని పిక్క 2-2.5 సెం.మీ పొడవు,1 సెం.మీ.వెడల్పు వుండును. కాయ మందంగా, బలంగా వున్న పైకవచం/పొర/పొట్టు (Hull) కలిగి, లోపల సాధారణంగా ఒకటి, లేదా రెండు పిక్కలను కలిగి వుండును. కాయలేత గోధుమ రంగులో, పిక్క ముధురు రంగులో వుండును. కాయ 5-6గ్రాం.లభారం, పిక్క 1-2గ్రాం.లువుండును. కాయలో 27-28% వరకు నూనె (పైపెంకు తొలగింవిన పప్పులో 36-40% వరకు నూనె), 17.0% ప్రొటిను (మాంసకృత్తులు),6.6% స్టార్చు,7-8% నారపదార్థాన్ని కలిగివుండును.[6] వుండును. పైపొట్టు తీసిన పిక్కలలో నూనె శాతం ఎక్కువగా వుండును. ఒక చెట్టునుండి ఎడాదికి 50-60 కేజిల కానుగ విత్తనాలను సేకరించ వచ్చును.[4] కాని చెట్లు చాలా ప్రాంతాలకు విస్తరించి వున్నందున విత్తన సేకరణ కొద్దిగా కష్టంతో కూడినపని.

నూనెను సంగ్రహించడం

[మార్చు]

సామాన్యంగా కానుగ కాయలపై పొట్టును తొలగించి (decorticated), పిక్కల నుండి నూనెను తీయుదురు. కానుగ గింజల నుండి 'ఎక్స్‌పెల్లరు'లనబడే నూనెతీయు యంత్రాల ద్వారా నూనె తీయుదురు. నూనె తీయగా ఇంకను ఆయిల్‌ కేకులో 6-10% వరకు మిగిలివున్న నూనెను సాల్వెంట్‌ ప్లాంట్‌ ద్వారా సంగ్రహించెదరు. నూనె తీసిన కేకును సేంద్రియ ఎరువుగా వినియోగిస్తారు. ఎక్సుపెల్లరుల ద్వారా 25%వరకు నూనెను విత్తనాల నుండి తీయొచ్చు. గ్రామాలలోని రోటరీలేదా బేబి ఎక్సుపెల్లరులు అయినచో 20% మాత్రమే దిగుబడి వచ్చును.

కానుగ నూనె

[మార్చు]

గింజ లనుండి తీసిన నూనె ఆరంజి-పసుపు రంగులో వుండి, చేదు రుచి కల్గి, ఒక రకమైన వెగటువాసన కల్గి వుండును. ఇందుకు కారణం కానుగ నూనెకో వున్న ఫ్లెవనాయిడ్స్.

కానుగ నూనె భౌతిక లక్షణాలు, కొవ్వు ఆమ్లాల శాతం[7]

నూనె భౌతిక గుణాలు

[మార్చు]
భౌతికథర్మం విలువ
సాంద్రత 0.933
అయోడిన్ విలువ 86.5
సపొనిఫికెసను విలువ 186
స్నిగ్థత 40.27
ఫ్లాష్‌ పాయింట్‌ 2120C
బాష్పీభవన ఉష్ణోగ్రత 330 °C
అన్‌సపోనిఫియబుల్ పదార్థం 0.9%
fire పాయింట్ 224 °C
క్లౌడ్‌ పాయింట్ 2 °C

నూనెలోని కొవ్వు ఆమ్లాలు

[మార్చు]

కానుగనూనెలో వున్న కొవ్వుఆమ్లాల పట్టిక [6]

కొవ్వు అమ్లాలు శాతం
పామిటిక్‌ ఆమ్లం 4-8
స్టియరిక్ ఆమ్లం 2.5-8
అరచిడిక్‌ ఆమ్లం 2.2-4.5
బెహెనిక్‌ ఆమ్లం 4-5
లిగ్నొసెరిక్‌ ఆమ్లం 1.5-3.5
ఒలిక్ ఆమ్లం 44-75
లినొలిక్ ఆమ్లం 10-18
ఐకొసెనొయిక్‌ ఆమ్లం 9-12
  • ఐయోడిన్‌విలువ:ప్రయోగశాలలో 100 గ్రాములనూనెచే శోషింపబడిన (గ్రహింపబడిన) ఐయోడిన్ గ్రాముల సంఖ్య. ప్రయోగ సమయంలో నూనెలోని, కొవ్వు ఆమ్లాలలోని ద్విబంధంవున్న కార్బను లతో అయోడిన్ సంయోగం చెంది, ద్విబంధాలను తొలగించును. ఐయోడిన్‌విలువ నూనెలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాల ఉనికిని తెలుపును.నూనె ఐయోడిన్‌విలువ పెరుగు కొలది, నూనెలోని అసంతృప్త కొవ్వుఆమ్లంల శాతం పెరుగును.
  • సపొనిఫికెసన్‌విలువ:ఒక గ్రాము నూనెలో వున్న కొవ్వుఆమ్లాలన్నింటిని సబ్బుగా (సపొనిఫికెసను) మార్చుటకు అవసరమగు పొటాషియంహైడ్రాక్సైడు, మి.గ్రాములలో.
  • అన్‌సపొనిఫియబుల్ మేటరు: నూనెలో వుండియు, పోటాషియంహైడ్రాక్సైడ్‌తో చర్యచెందని పదార్థాలు.ఇవి అలిఫాటిక్‌ఆల్కహల్‌లు, స్టెరొలులు (sterols), వర్ణకారకములు (pigments), హైడ్రోకార్బనులు,, రెసినస్ (resinous) పదార్థాలు.

జీవ ఇంధనం కానుగ నూనె

[మార్చు]

నూనెలను ఆల్కహాల్ లను సమ్మేళనం చేసి ట్రాన్సు ఎస్టరిఫికేసన్ (transesterification) చెయ్యటం వలన, నూనెలోని కొవ్వు ఆమ్లాలు మిథైల్ఆల్కహాల్ ల సంయోగం వలన మిథైల్ ఎస్టరులు ఏర్పడును. మిథైల్ ఎస్టరులను జీవ ఇంధనంగా, డిసెల్‌లో 10-20% కలిపి వాహన ఇంధనంగా ఉపయోగించవచ్చును.మిథనాల్‌సిస్ విధానంలో జీవ ఇంధనంగా మార్చబడిన కానుగ నూనె యొక్క భౌతిక ధర్మాల వివరాలను పట్టికగా దిగువ ఇవ్వడమైనది.

కానుగనూనె జీవ ఇంధనం ధర్మాలు [8]

గుణం/స్వభావం విలువల మితి ప్రయోగ పద్ధతి
సాంద్రత,15°Cవద్ద 889కిలో/m3 IS1448P:16
కినెమాటిక్ స్థిగ్నత,40°Cవద్ద 5.431cSt IS1448P:25
ఫ్లాష్‌ పాయింట్ 116 °C IS1448P:20
క్లౌడ్‌ పాయింట్ 22 °C IS1448P:10
పోర్‌పాయింట్ 15.8 °C IS1448P:10
కార్బన్‌అవశేషం%w/w 0.08 IS1448P:8
బూడిదం.w/w 0.003% IS1448P:4

నూనె ఉపయోగాలు

[మార్చు]
  • కానుగ నూనె ఆహరయోగ్యంకానప్పటికి ఇతర ఉపయోగాలున్నాయి. కానుగనూనెతో, విద్యుతుసరఫరాలేని ప్రాంతాలలో (మారుమూలప్రాంతపు గ్రామాలలో) దీపాలను వెలిగించుటకు ఉపయోగిస్తారు.
  • కానుగనూనెను ఆముదం నూనెతో కలిపి ఎద్దుల బండ్ల ఇరుసుకు కందెనగా వుపయోగిస్తారు.
  • సబ్బుల తయారిలోను, చర్మ పరిశ్రమలలో టానింగ్‌ చేయుటకు వినియోగిస్తారు.[9]
  • ఆలాగే కీళ్లవాపులకు, కీళ్ళనొప్పులకు వాడు మందులలో వినియోగిస్తారు. గజ్జి, చుండ్రు, చర్మంపైపొక్కులు, బొల్లి, స్కాబిస్‌ నివారణ మందులలోకూడ ఉపయోగిస్తారు.[10]
  • కర్నాటకలోని, విద్యుతుసౌకర్యంలేని, అడవి ప్రాంతాలలోవున్న కొన్ని గ్రామాలలో ఆయిల్‌ ఇంజినులను కానుగ నూనెను ఇంధనంగా ఉపయోగించి తిప్పి, గ్రామాలకు విద్యుతు సరఫరా చేసారు. 20% వరకు కానుగనూనెను డిసెల్‌తో కలిపి అంతర్గత ఇంధన దహన యంత్రం (internal combustion engine.I.C.engine) (డిసెల్‌ఇంజిన్) ను తిప్పవచ్చునని ప్రయోగాత్మకంగా నడిపిచూపారు.
  • బయోడిసెల్ తయారికి కానుగ నూనెను వినియోగించవచ్చును. జట్రొఫా నూనెతో పోల్చినచో కానుకనూనె బయో డిసెల్‌తయారికి ఎంతో అనువైనది.
  • నూనెలో వున్న కరొంజిన్ అనేపదార్థం (karanjin) ఒక జీవ ఉత్ప్రేరకం (bioactive molecule).[11]

నూనె ఉత్పత్తి గణాంకాలు

[మార్చు]

కానుగ నూనె ఉత్పత్తి వివరాలు అంత ప్రోత్యాహకరంగా లేవు. అందిన సమాచారం ప్రకారం 1999-2009 వరకు కేవలం800 టన్నుల కానుకనూనె ఉత్పత్తి అయ్యినది.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. "Classification". bioweb.uwlax.edu/. Retrieved 2014-02-06.
  2. "Karanja – Pongamia pinnata – Benefits, Usage, Ayurveda Details". www.learningayurveda.com/. Archived from the original on 2014-02-18. Retrieved 2014-02-06.
  3. "Pongam Tree". www.flowersofindia.net/. Retrieved 2014-02-06.
  4. 4.0 4.1 SEA,HandBook-2009,By The Solvent Extractors' Association of India
  5. "Pongamia pinnata". www.greenfueltech.net/. Archived from the original on 2008-05-06. Retrieved 2014-02-06.
  6. 6.0 6.1 "Pongamia pinnata (L.) Pierre". www.hort.purdue.edu/. Retrieved 2014-02-06.
  7. "STUDIES ON THE PROPERTIES OF KARANJA OIL FOR PROBABLE INDUSTRIAL APPLICATION" (PDF). www.ethesis.nitrkl.ac.in/. Retrieved 2014-10-23.
  8. "menthonolysis of Pongamia pinnata(Karanja)" (PDF). nopr.niscair.res.in. Retrieved 2015-03-27.
  9. "KARANJA". jhamfcofed.com/. Archived from the original on 2016-03-04. Retrieved 2014-02-06.
  10. "Karanja Oil". fromnaturewithlove.com. Archived from the original on 2010-08-14. Retrieved 2014-02-06.
  11. "Extraction and recovery of karanjin: A value addition to karanja (Pongamia pinnata) seed oil". www.sciencedirect.com/. Retrieved 2014-02-06.