వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కామెరాన్ డోనాల్డ్ గ్రీన్[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | పెర్త్, ఆస్ట్రేలియా | 1999 జూన్ 3|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 198[1] cమీ. (6 అ. 6 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Batting ఆల్ రౌండరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 459) | 2020 డిసెంబరు 17 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 జూలై 19 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 230) | 2020 డిసెంబరు 2 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 సెప్టెంబరు 7 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 42[2] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 101) | 2022 ఏప్రిల్ 5 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2022 నవంబరు 4 - Afghanistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 42 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016/17– | వెస్టర్న్ ఆస్ట్రేలియా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018/19– | పెర్త్ స్కార్చర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023– | ముంబై ఇండియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 21 June 2023 |
కామెరాన్ డొనాల్డ్ గ్రీన్ (జననం 1999 జూన్ 3) వెస్ట్రన్ ఆస్ట్రేలియా, పెర్త్ స్కార్చర్స్ తరపున బ్యాటింగు ఆల్ రౌండర్‌గా ఆడుతున్న ఆస్ట్రేలియా జాతీయ జట్టు క్రికెటరు. అతను డిసెంబరు 2020లో ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ రంగప్రవేశం చేసాడు [3] 2023 ICC వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియన్ జట్టులో గ్రీన్ సభ్యుడు.
గ్రీన్, పెర్త్‌లోని సుబియాకోలో పెరిగాడు. సుబియాకో-ఫ్లోరెట్ క్రికెట్ క్లబ్ కోసం ఆడాడు. అతను 2009-10 సీజన్‌లో అతను 10 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అండర్ 13ల లీగ్‌లో ఆడటం ప్రారంభించాడు.[4] అతని వేగవంతమైన అభివృద్ధి కారణంగా 16 సంవత్సరాల వయస్సులో తన WACA ఫస్టు గ్రేడ్ రంగప్రవేశం చేసాడు. గ్రీన్ 2016/17 షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌కు ముందు వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్ (WACA)తో రూకీ ఒప్పందాన్ని పొందాడు. అండర్ 19 జాతీయ లీగ్‌లో సగటున ఇన్నింగ్స్‌కు 82 పరుగులు, 8 గేమ్‌లలో 20 వికెట్లు తీయడం దీనికి ప్రధానా కారణం. [5]
2017 జనవరి 10న ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా పాకిస్తాన్‌తో జరిగిన క్రికెట్ ఆస్ట్రేలియా XI తరఫున గ్రీన్ తన తొలి లిస్ట్ A మ్యాచ్ ఆడాడు. [6] 2017 ఫిబ్రవరి 10న 2016–17 షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున ఫస్ట్-క్లాస్ లోకి అడుగుపెట్టాడు.[7] మొదటి ఇన్నింగ్స్‌లో 5/24 తీసుకుని, షెఫీల్డ్ షీల్డ్‌లో ఐదు వికెట్ల పంట తీసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు.[8] 2019 జనవరి 13న 2018–19 బిగ్ బాష్ లీగ్ సీజన్‌లో పెర్త్ స్కార్చర్స్ తరపున ట్వంటీ20 రంగప్రవేశం చేసాడు.[9]
ఒరిజినల్‌గా బౌలింగ్ ఆల్ రౌండరైన గ్రీన్, వరుస గాయాల తర్వాత తన బ్యాటింగ్‌ను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టడం ప్రారంభించాడు. [10] 2019–20 షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌లో క్వీన్స్‌లాండ్‌పై 87*, 121* పరుగులు అతని అద్భుత ప్రదర్శన. [11]
2020 అక్టోబరులో, భారత్‌తో జరిగే పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల కోసం ఆస్ట్రేలియా జట్టులో గ్రీన్ ఎంపికయ్యాడు. [12] 2020 నవంబరులో, అతను భారత్‌తో జరిగే మ్యాచ్‌ల కోసం ఆస్ట్రేలియా యొక్క టెస్టు జట్టులో కూడా ఎంపికయ్యాడు. [13] గ్రీన్ 2020 డిసెంబరు 2న భారత్‌పై ఆస్ట్రేలియా తరపున వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.[14] టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా A తరపున గ్రీన్ సెంచరీ చేశాడు. [15] అతను ఆస్ట్రేలియా తరపున 2020 డిసెంబరు 17న భారత్‌పైనే తన టెస్టు రంగప్రవేశం కూడా చేశాడు. [16]
2021 మార్చిలో, 2020–21 షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌లో క్వీన్స్‌లాండ్‌పై వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున 251 పరుగులతో గ్రీన్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన తొలి డబుల్ సెంచరీ సాధించాడు. [17] 2022 ఫిబ్రవరిలో, పాకిస్తాన్ పర్యటన కోసం ఆస్ట్రేలియా ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టుకు గ్రీన్ ఎంపికయ్యాడు. [18] అతను తన T20I రంగప్రవేశం 2022 ఏప్రిల్ 5న ఆస్ట్రేలియా తరపున పాకిస్తాన్‌పై ఆడాడు. [19] 2022 ఆగష్టులో, అతను టౌన్స్‌విల్లేలో జింబాబ్వేపై తన మొదటి వన్‌డే ఐదు వికెట్ల పతకాన్ని సాధించాడు. [20] కెయిర్న్స్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్‌డే లో, కష్టతరమైన పరుగుల వేటలో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. [21] భారత్‌తో జరిగిన T20I సిరీస్‌లో, గ్రీన్ రెండు అర్ధ సెంచరీలు చేశాడు. [22]
2022 అక్టోబరులో, జోష్ ఇంగ్లిస్‌కు గాయమైనపుడు, అతని స్థానంలో గ్రీన్‌ను 2022 T20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టులోకి తీసుకున్నారు.[23]
2022 డిసెంబరులో, మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో దక్షిణాఫ్రికా పర్యటనలో బాక్సింగ్ డే టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు గ్రీన్, టెస్టు క్రికెట్‌లో తన తొలి ఐదు వికెట్ల పంట సాధించాడు. [24]
IPL 2023 వేలంలో, గ్రీన్‌ని ముంబై ఇండియన్స్ INR 17.5 కోట్లకు కొనుగోలు చేసింది. IPL వేలం చరిత్రలో రెండవ అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా, అత్యంత ఖరీదైన ఆస్ట్రేలియన్ ఆటగాడిగా నిలిచాడు. [25]
2023 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అహ్మదాబాద్‌లో జరిగిన నాల్గవ టెస్టులో గ్రీన్, తన తొలి టెస్టు సెంచరీ (114) సాధించాడు. [26]
{{cite web}}
: CS1 maint: url-status (link)
{{cite web}}
: CS1 maint: url-status (link)
{{cite web}}
: CS1 maint: url-status (link)