కామ్నా చంద్ర భారతీయ రచయిత్రి. ఆల్ ఇండియా రేడియో కోసం నాటకాలనూ, స్క్రీన్‌కు కథలనూ, సంభాషణలనూ రాసింది. ఇందులో చాందిని,[1] 1942: ఎ లవ్ స్టోరీ (ఈమె అల్లుడు విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించాడు),[2][3] ప్రేమ్ రోగ్, టెలివిజన్ షో కశిష్ వంటివి ఉన్నాయి.[4]
కామ్నా ముజఫర్‌నగర్ ప్రాంతానికి చెందినది. డెహ్రాడూన్‌లోని ఎంకెపి కళాశాలలో చదివింది.[5] ఆ తర్వాత అలహాబాద్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. వ్యాపార కార్యనిర్వాహక అధికారి నవీన్ చంద్రను వివాహం చేసుకుంది.[6] రచయిత విక్రమ్ చంద్ర, సినీ విమర్శకుడు అనుపమ చోప్రా (సినిమా నిర్మాత విధు వినోద్ చోప్రాను వివాహం చేసుకున్నది), చిత్ర దర్శకురాలు తనూజా చంద్రకు తల్లి. ఈమె మనవరాలు జుని చోప్రా (అనుపమ కుమార్తె) కూడా రచయితే.[7]
సంవత్సరం | సినిమా పేరు | విభాగం |
---|---|---|
1982 | ప్రేమ్ రోగ్[8] | కథ |
1984 | తృష్ణ (టీవీ సిరీస్) | స్క్రీన్ ప్లే |
1989 | చాందిని | కథ |
1992 | కాశిష్ (టీవి) | కథ |
1994 | 1942: ఎ లవ్ స్టోరీ | కథ, సంభాషణలు |
1998 | కరీబ్ | కథ, సంభాషణలు |
2017 | ఖరీబ్ ఖరీబ్ సింగిల్[9] | కథ, సంభాషణలు |