ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ 2018లో కామ్య పంజాబీ
జననం
(1979-08-13) 1979 ఆగస్టు 13 (వయసు 45)
వృత్తి
నటి, రాజకీయవేత్త
క్రియాశీల సంవత్సరాలు
1996–ప్రస్తుతం
సుపరిచితుడు/ సుపరిచితురాలు
అస్తిత్వ...ఏక్ ప్రేమ్ కహానీ
బానూ మైన్ తేరీ దుల్హన్
శక్తి - అస్తిత్వ కే ఎహసాస్ కి
మర్యాద: లేకిన్ కబ్ తక్
బిగ్ బాస్ హిందీ సీజన్ 7
రాజకీయ పార్టీ
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (2021-ప్రస్తుతం)
జీవిత భాగస్వామి
బంటీ నేగి
(m. 2003; div. 2013)
శలభ్ డాంగ్
(m. 2020)
పిల్లలు
2
కామ్య పంజాబీ (జననం 1979 ఆగస్టు 13)ని కామ్య శలభ్ డాంగ్ అని కూడా పిలుస్తారు.[1][2] ఆమె ఒక భారతీయ నటి, రాజకీయ నాయకురాలు. ఆమె అనేక హిందీ టెలివిజన్ రంగానికి చేసిన కృషికి ప్రసిద్ధి చెందింది.[3][4] ఆమె 2013లో కలర్స్ టీవి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నందుకు కూడా మంచి పేరు తెచ్చుకుంది.[5] ఆమె 2021 అక్టోబరు 27న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరింది.[6]
రేత్, అస్తిత్వ...ఏక్ ప్రేమ్ కహానీ, బానూ మే తేరీ దుల్హన్ వంటి భారతీయ టెలివిజన్ ధారావాహికలలో పంజాబీ నెగటివ్ పాత్రలు పోషించినందుకు ప్రసిద్ధి చెందింది. పియా కా ఘర్, మర్యాద: లేకిన్ కబ్ తక్, క్యున్ హోతా హై ప్యార్‌లో కూడా పంజాబీ సానుకూల పాత్రలు పోషించింది.
ఆమె సోనీ టీవీలో కామెడీ సర్కస్ కామెడీ షో రెండవ సీజన్‌లో చేసింది. కలర్స్ టీవీలో బిగ్ బాస్ 7లో కూడా ఆమె పాల్గొన్నది.[7]
1997లో, ఆమె మెహందీ మెహందీ అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. అనామిక రూపొందించిన కాలా షా కాలా అనే మ్యూజిక్ వీడియోలో కూడా భాగమైంది.[8] ఆమె బాలీవుడ్ చిత్రాలైన కహో నా ప్యార్ హై, నా తుమ్ జానో నా హమ్, యాదీన్, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ, కోయి మిల్ గయా, తెలుగు సినిమామా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి చిత్రాలలో చిన్న పాత్రలలో నటించింది.[9]
2019లో, ఆమె తన తోటి టెలివిజన్ నటి కవితా కౌశిక్‌తో కలిసి పైజామా పార్టీ నాటకంలో తన రంగస్థల అరంగేట్రం చేసింది.[10]
కామ్య పంజాబీ 1979 ఆగస్టు 13న జన్మించింది.[1] బిగ్ బాస్ హిందీ సీజన్ 7లో ఉన్న సమయంలో, ఆమె టెలివిజన్ నటి ప్రత్యూష బెనర్జీతో సన్నిహితగా ఉంది.[11][12] ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య తర్వాత, కామ్య పంజాబీ ఆమె జీవితం ఆధారంగా ఒక చిత్రాన్ని విడుదల చేసింది.[13]
కామ్య పంజాబీ 2003లో బంటీ నేగీని వివాహం చేసుకుంది.[14] ఆమె 2009లో తన కుమార్తె ఆరాకు జన్మనిచ్చింది.[15] వారు 2013లో విడాకులు తీసుకున్నారు.[16]
ఆమె టెలివిజన్ నటుడు కరణ్ పటేల్‌తో డేటింగ్ చేసింది కానీ 2015లో విడిపోయారు.[17][18]
ఆమె తన ప్రియుడు, ఢిల్లీకి చెందిన వైద్యుడు శలభ్ డాంగ్‌ని 2020 ఫిబ్రవరి 10న ఆమె తిరిగి వివాహం చేసుకుంది.[19] అయితే, శలభ్ డాంగ్ కి అతని మొదటి భార్య ఇషాన్ లకు ఒక కుమారుడు ఉన్నాడు. ఇక కామ్య పంజాబీ, శలభ్ డాంగ్‌లకు ఆరా, ఇషాన్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు.[20][21][22]