కారైక్కుడి సాంబశివ అయ్యర్ | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
జననం | 1888 తిరుగోకర్ణం, తమిళనాడు |
మరణం | 1958 (aged 69–70) |
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | వీణావాద్య కళాకారుడు |
వాయిద్యాలు | వీణ |
కారైక్కుడి సాంబశివ అయ్యర్ (1888 - 1958) కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. వీణ వాద్యకారుడు.
ఇతడు 1888వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం, పుదుక్కొట్టై జిల్లా, తిరుగోకర్ణంలో వీణ విద్వాంసుడు సుబ్బయ్య అయ్యర్‌కు రెండవ కుమారుడిగా జన్మించాడు. ఇతడు తన తండ్రి సుబ్బయ్య అయ్యర్ వద్ద తన అన్న సుబ్బరామ అయ్యర్‌తో కలిసి వీణ నేర్చుకున్నాడు. వీరిద్దరూ వారి కుటుంబంలో ఏడవ తరానికి చెందిన వీణా విద్వాంసులు. ఇద్దరూ కలిసి "కారైక్కుడి బ్రదర్స్" పేరుతో కచేరీలు నిర్వహించారు. వీరిద్దరూ మొదటి కచేరీనుండి 1934వరకూ అప్రతిహతంగా జంటగా కచేరీలు చేశాడు. సాంబశివ అయ్యర్ తన భీకరమైన సాధనతో "అసుర సాధకుడి"గా పేరు పొందాడు.
ఇతనికి సంతానం కలగలేదు. 1957లో ఇతడు కారైక్కుడి ఎస్.సుబ్రహ్మణ్యన్‌ను దత్తత తీసుకున్నాడు.
ఇతడు చెన్నైలోని కళాక్షేత్రలో వీణ బోధిస్తూ అక్కడే నివసించాడు.[1] 1952లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ప్రవేశపెట్టిన సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన మొట్టమొదటి కళాకారులలో ఇతడు ఉన్నాడు.[2] అదే ఏడాది మద్రాసు సంగీత అకాడమీ ఇతడికి సంగీత కళానిధి పురస్కారం ప్రకటించింది.[3] 1954లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ప్రకటించిన మొట్టమొదటి ఫెలోషిప్ జాబితాలో కూడా ఇతడు ఉన్నాడు.[4]
ఇతని శిష్యులలో రంగనాయకి రాజగోపాల్, రాజేశ్వరీ పద్మనాభన్, జయలక్ష్మి సుకుమార్, కారైక్కుడి సుబ్రహ్మణ్యన్ మొదలైన వారున్నారు.[5]
ఇతడు 1958లో మరణించాడు.