కార్తీకా నాయర్ | |
---|---|
జననం | 1992 జూన్ 27 |
వృత్తి | నటి,మొడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2009 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రోహిత్ మేనన్ |
తల్లిదండ్రులు | రాధ |
బంధువులు | తులసి_నాయర్ (సొదరి) |
కార్తికా నాయర్ (జననం 27 జూన్ 1992)[1] ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె ముఖ్యంగా దక్షిణ భారత సినిమాల్లో నటించింది. 2009లో అక్కినేని నాగచైతన్య సరసన తెలుగు సినిమా జోష్ తో తెరంగేట్రం చేసింది కార్తికా. జీవా సరసన ఆమె నటించిన రెండో చిత్రం రంగంతో ఆమె ప్రసిద్ధి చెందింది. ఈ సినిమా అసలు తమిళం లో తీసి, తెలుగులో డబ్బింగ్ చేశారు.
కార్తీకా తల్లి ప్రముఖ నిన్నటి తరం నటి రాధ . ఆమె పెద్దమ్మ అంబిక కూడా ప్రముఖ దక్షిణ భారత నటే. కార్తికాకు ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. ఆమె చెల్లెలు తులసి నాయర్ కూడా సినిమాల్లో నటించింది. కార్తికా ముంబైలోని పోడర్ అంతర్జాతీయ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది.[2] లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అనుబంధ కళాశాలలో అంతర్జాతీయ బిజినెస్ డిగ్రీ చదువుకుంది కార్తికా.
2009లో తన 17వ ఏట తెలుగు సినిమా జోష్ తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఆమె నాగచైతన్య సరసన నటించింది. ఆమె రెండో సినిమా రంగం. తమిళంలో తీసిన ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేయగా, రెండు భాషల్లోనూ విజయవంతం కావడం విశేషం.[3] ఆ తరువాత ఆమె మలయాళంలో లెనిన్ రాజేంద్రన్ దర్శకత్వంలో మకరమంజు సినిమాలో నటించింది కార్తికా. ఆ తరువాత ఆమె భారతీరాజా దర్శకత్వంలో అన్నాకొడి సినిమాలో నటించింది.
తిరువనంతపురంలోని ఉదయ్ సముద్ర లీజర్ బీచ్ హోటల్‌లో కార్తీక నాయర్ వివాహం 2023 నవంబర్ 19న రోహిత్ మేనన్‌తో జరిగింది.[4][5]
† | ఇంకా విడుదలైన సినిమాలను సూచిస్తుంది |
సంవత్సరం | చలన చిత్రం | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2009 | జోష్ | విద్యా | తెలుగు | ఉత్తమ తొలి నటి సంతోషం అవార్డ్స్ ,ఉత్తమ తొలి నటి సినిమా(CineMAA) అవార్డ్స్ |
2011 | కో(రంగం) | రేనుకా నారాయణన్ | తమిళం | |
మకతమంజు | సుగందా బాయి, ఊర్వశి | మలయాళం | ||
2012 | దమ్ము | నీలవేణి | తెలుగు | |
2013 | కమ్మత్ & కమ్మత్ | సురేఖా | మలయాళం | |
అన్నకొడి | అన్నకొడి | తమిళం | ||
బృందావన | భూమి | కన్నడ | బృందావనం యొక్క పునఃనిర్మాణం | |
2014 | బ్రదర్ అఫ్ బొమ్మలి(సినిమా) | లక్ష్మి/లక్కి | తెలుగు | |
2015 | పుఱంపోక్కు | కుయిలి | తమిళం | |
వా డీల్ † | తమిళం | ఆలస్యంమైనది |
సంవత్సరం | దారావాహిక | పాత్ర | భాష | చానలు | గమనికలు |
---|---|---|---|---|---|
2017 | ఆరంభ్ | దేవసేన | హిందీ | స్టార్ ప్లస్ | తొలి ధారావాహిక |