కార్ల్ జంషెడ్ ఖండాలవాలా (1904 మార్చి 16 - 1995 డిసెంబరు 23) భారతీయ పార్సీ కళా పారంగతుడు, న్యాయవాది, భారత వైమానిక దళ అధికారి.[1][2] ఆయన చాలాకాలం పాటు ట్రస్టీగా, ముంబైలోని మాజీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం ఆఫ్ వెస్ట్రన్ ఇండియా ఛైర్మనుగా ఉన్నారు. కళలకు ఆయన చేసిన సేవలకు గాను 1970లో భారతదేశంలోని నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ తో సత్కరించబడ్డారు. 1980లో లలిత కళా అకాడమీ ఫెలోషిప్ కూడా అందుకున్నారు.[3]
న్యాయవాదిగా, ఆయన కె. ఎం. నానావతి వర్సెస్ మహారాష్ట్ర రాష్ట్రం కేసులో డిఫెన్స్ తరపున వాదించారు.[4]