కాలా | |
---|---|
దర్శకత్వం | పా. రంజిత్ |
రచన | పా. రంజిత్ ఆధవాన్ ధీట్చన్య మాకిజ్హ్నం (డైలాగ్స్) |
నిర్మాత | ధనుష్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | మురళి జి. |
కూర్పు | అక్కినేని శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | సంతోష్ నారాయణన్ |
నిర్మాణ సంస్థ | వండర్ బార్ ఫిలింస్ |
పంపిణీదార్లు | లైకా ప్రొడక్షన్స్ |
విడుదల తేదీs | 6 జూన్ 2018(Malaysia) 7 జూన్ 2018 (India) |
సినిమా నిడివి | 159 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాషలు | తమిళ్, తెలుగు |
బడ్జెట్ | 80 -140 కోట్లు [2] |
కాలా 2018లో విడుదలైన యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా. వండర్ బార్ ఫిలింస్ పతాకంపై ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించగా పా. రంజిత్ దర్శకత్వం వహించాడు. [3]
ముంబయిలోని మురికివాడ ధారావిలో స్థిరపడ్డ బడుగు జీవుల కోసం పోరాడే నాయకుడు కాలా (రజనీకాంత్). మిగతా ముంబయి నగరం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకున్న రాజకీయ నేత హరి దాదా (నానా పటేకర్)కు ధారావి మాత్రం చేజిక్కదు. అక్కడ కాలా ఆధిపత్యాన్ని అతను సహించలేకపోతాడు. రియల్ ఎస్టేట్ మాఫియా ద్వారా ధారావిపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తాడు. అతడికి కాలా అడ్డు తగులుతాడు. దీంతో ఇద్దరి మధ్య సంఘర్షణ మొదలవువుతుంది. మరి వీళ్లిద్దరి ఎత్తులు పై ఎత్తులు ఎలా సాగాయి.. చివరికి ఎవరు పైచేయి సాధించారు అన్నది మిగతా సినిమా కథ.[4]