కాళిదాసు (2008 సినిమా)

కాళిదాసు
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం రవిచరణ్ రెడ్డి
నిర్మాణం ఎ. నాగసుశీల, చింతలపూడి శ్రీనివాసరావు
కథ రవిచరణ్ రెడ్డి
చిత్రానువాదం రవిచరణ్ రెడ్డి
తారాగణం సుశాంత్
తమన్నా
సంగీతం చక్రి
సంభాషణలు రాజసింహ
ఛాయాగ్రహణం అఖిలన్
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ శ్రీనాగ్ కార్పొరేషన్, అన్నపూర్ణ స్టుడియోస్ (సమర్పణ)
విడుదల తేదీ 11 ఏప్రిల్ 2008
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కాళిదాసు 2008 లో రవిచరణ్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో సుశాంత్, తమన్నా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఎ. నాగసుశీల, చింతలపూడి శ్రీనివాసరావు కలిసి శ్రీనాగ్ కార్పొరేషన్ సంస్థ పతాకంపై నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పించింది. చక్రి ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు.

కాళిదాసు ఒక సిన్సియర్ పోలీసు అధికారి కుమారుడు. ఆ అధికారి ఒక ఫ్యాక్షనిస్టు చేతిలో మరణించగా కాళిదాసు అతన్ని చంపి రాయలసీమ నుంచి పారిపోయి వచ్చేసి గుంటూరు చేరుకుంటాడు. కనకదుర్గ అనే ఆమె తన కుమారుడు జయదేవ్ తో పాటు కాళిదాసును తన కుమారుడిగా పెంచుకుంటుంది. కాళిదాసు కార్ల దొంగగా మారి జై దేవ్ చదువుకు సహాయం చేస్తూ ఉంటాడు. దొంగతనం చేసిన కార్లను బాబా అనే వ్యక్తి కొంటూ ఉంటాడు. బాబా కొడుకు బాషా కూడా అతనికి స్నేహితుడవుతాడు. ఒకసారి కాళిదాసు కారును దొంగిలిస్తే అందులో ఒక అమ్మాయి దాక్కుని ఉంటుంది. ఆమె పిచ్చిగా ప్రవర్తిస్తూ తన పేరు మిర్చి అని చెబుతుంది. కానీ కాళిదాసుకు మాత్రం ఆ అమ్మాయి పిచ్చిది కాదనీ, కావాలనే అలా నటిస్తుందని అనుమానంగా ఉంటుంది. ఒకసారి ప్రతాప్, అజయ్ అనే రౌడీలు వచ్చి భాషా ను చంపి మిర్చిని తీసుకెళ్ళి పోతారు.

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

పాటల రచయిత చంద్రబోస్

హే బేబీ హే బేబీ , గానం . చక్రి, కౌసల్య

తడిసి మోపెడు , గానం రవివర్మ , అనురాధ శ్రీరామ్

ఎల్లకే ఎల్లకే , గానం. వాసు, గీతామాధురి

ప్రేమ(ఒకసారి కారం) గానం.చక్రి , కౌసల్య

పద పదరే , గానం.దేవన్

చీమ లేమో చక్కెర , గానం.బాబా సెహగల్.

సాంకేతిక సిబ్బంది

[మార్చు]
  • కథ - చిత్రానువాదం - మాటలు - దర్శకత్వం: జి. రవిచరణ్ రెడ్డి
  • సంగీతం: చక్రి
  • కెమెరా: అఖిలన్
  • కూర్పు: గౌతంరాజు

మూలాలు

[మార్చు]