కిరణ్ మహేశ్వరి | |
---|---|
రాజస్థాన్ శాసనసభ్యురాలు | |
In office 2013–2020 | |
నియోజకవర్గం | రాజ్ సమంద్ |
In office 2004–2009 | |
అంతకు ముందు వారు | గిరిజ నాథ్ |
తరువాత వారు | రఘువీర్ మీనా |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1961 అక్టోబర్ 29 ఉదయపూర్, రాజస్థాన్, భారతదేశం |
మరణం | 2020 నవంబర్ 30 |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | సత్యనారాయణ్ |
సంతానం | దీప్తి కిరణ్ మహేశ్వరి దీప్తి కిరణ్ |
As of నవంబర్ 24, 2009 Source: [1] |
కిరణ్ మహేశ్వరి (29 అక్టోబర్ 1961 - 30 నవంబర్ 2020) రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు.భారతీయ జనతా పార్టీ కి చెందిన రాజకీయ నాయకురాలు.
కిరణ్ మహేశ్వరి 14వ లోక్‌సభ కు(2004–2009)లో ఉదయపూర్ నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యురాలుగా పనిచేశారు. కిరణ్ మహేశ్వరి 2009 ఎన్నికల్లో అజ్మీర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభకుపోటీ చేసి భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన సచిన్ పైలట్ చేతిలో ఓడిపోయింది. కిరణ్ మహేశ్వరి 2013 లో జరిగిన రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో రాజ్‌సమంద్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి 30,000 ఓట్ల తేడాతో గెలుపొందింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కిరణ్ మహేశ్వరి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. [1] [2]
కిరణ్ మహేశ్వరి 2020 చివరలో కరోనా వైరస్ బారిన పడింది. కిరణ్ మహేశ్వరి హర్యానాలోని గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలో గత 21 రోజులుగా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ఉన్న తర్వాత ఒక నెల తరువాత, నవంబర్ 30 న మరణించింది. [3] [4]