కిల్లి కృపారాణి | |||
![]()
| |||
భారత పార్లమెంటు సభ్యులు
| |||
పదవీ కాలం 2009- 2014 | |||
ముందు | కింజరాపు ఎర్రంనాయుడు | ||
---|---|---|---|
తరువాత | కింజరాపు రామ్మోహన నాయుడు | ||
నియోజకవర్గం | శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | శ్రీకాకుళం, భారతదేశం | 1979 నవంబరు 19||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | డాక్టర్ కిల్లి రామ్మోహనరావు | ||
సంతానం | ఇద్దరు | ||
నివాసం | టెక్కలి గ్రామం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ | ||
మతం | కాళింగ, హిందూ | ||
వెబ్‌సైటు | kruparani.killi@sansad.nic.in |
డాక్టర్ కిల్లి కృపారాణి ఒక భారతీయ రాజకీయ నాయకురాలు, వైద్యురాలు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుండి 15 వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర సమాచార, టెలీకమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేస్తున్నారు.
శ్రీకాకుళంలో 1965 నవంబరు 19 న కామయ్య, కౌసల్య దంపతులకు జన్మించింది. విశాఖపట్నం ఆంధ్ర వైద్య కళాశాల నుండి ఎం. బి. బి. ఎస్ పూర్తిచేసింది.
2004 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయింది. కానీ 2009 ఎన్నికలలో నాలుగుసార్లు ఎ.పీగా గెలిచిన కింజరాపు ఎర్రన్నాయుడు పై భారీ మెజారిటీతో గెలిచి[1] ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించింది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌లోనే కొనసాగిన ఆమె 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీలో చేరి, 2019, 2024 ఎన్నికల్లో టికెట్ ఆశించగా, ఆమెకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆమె 2024 ఏప్రిల్ 3న వైసీపీకి రాజీనామా చేసి[2], ఏప్రిల్ 5న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి[3] 2024లో అసెంబ్లీ ఎన్నికలలో టెక్కలి నుండి పోటీ చేయనుంది.
ఈవిడ వివాహము డాక్టర్ కిల్లి రామ్మోహన్ రావుతో 1985 జూన్ 12 న జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు.
ఈమె బ్రిటన్, అమెరికా, వంటి దేశాలలో పర్యటించింది. ఆయా దేశాలలో భారత ప్రభుత్వం తరుపున అనేక సమావేశాలలో పాల్గొన్నది.