కుంభకోణం రాజమాణిక్యం పిళ్ళై | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | అలంగుడి, తమిళనాడు | 1898 ఆగస్టు 5
మరణం | 1970 | (వయసు 71–72)
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | వాయులీన విద్వాంసుడు |
వాయిద్యాలు | వయోలిన్ |
కుంభకోణం రాజమాణిక్యం పిళ్ళై (తమిళం: கும்பகோணம் ராஜமாணிக்கம் பிள்ளை, 1898 - 1970 ) తమిళనాడుకు చెందిన వాయులీన విద్వాంసుడు.
ఇతడు 1898, ఆగష్టు 5వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని అలంగుడి అనే కుగ్రామంలో జన్మించాడు. ఇతడు మొదట నాదస్వర విద్వాంసుడు కందస్వామి పిళ్ళై వద్ద గాత్ర సంగీతం అభ్యసించాడు. తరువాత తిరువిసనల్లూర్ "పల్లవి" నారాయణస్వామి అయ్యర్, పందనల్లూర్ చిన్నస్వామి పిళ్ళైల వద్ద సంగీతాన్ని నేర్చుకున్నాడు. తిరుకోడికవల్ రామస్వామి అయ్యర్ వద్ద నాలుగు సంవత్సరాలు వయోలిన్ నేర్చుకున్నాడు.[1] ఇతడు సోలో ప్రదర్శనలతో పాటు తన సమకాలీన అగ్రశ్రేణి సంగీతవిద్వాంసుల కచేరీలకు వాద్య సహకారం అందించాడు.[2]
ఇతని శిష్యులలో ఎం.ఎం.దండపాణి దేశికర్, మాయవరం వి.ఆర్.గోవిందరాజ పిళ్ళై మొదలైన వారు పేరు గడించారు.[2] తమిళ సినిమా నటుడు "త్యాగు" ఇతని మనుమడు.[7]