వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | కుల్దీప్ రాంపాల్ సేన్ |
పుట్టిన తేదీ | హరిహర్‌పూర్, రీవా, మధ్యప్రదేశ్, | 1996 అక్టోబరు 22
బ్యాటింగు | కుడిచేతి వాటం |
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ |
పాత్ర | బౌలింగ్ |
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు |
|
ఏకైక వన్డే (క్యాప్ 250) | 2022 డిసెంబరు 4 - బంగ్లాదేశ్ తో |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2018–ప్రస్తుతం | మధ్యప్రదేశ్ |
2022–ప్రస్తుతం | రాజస్థాన్ రాయల్స్ |
మూలం: Cricinfo, 4 డిసెంబరు 2022 |
కుల్దీప్ రాంపాల్ సేన్, మధ్యప్రదేశ్ కు చెందిన భారతీయ అంతర్జాతీయ క్రికెటర్. దేశీయ క్రికెట్లో మధ్యప్రదేశ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. కుడిచేతి ఫాస్ట్ బౌలర్ బౌలర్ గా రాణించిన కుల్దీప్ 145kmph కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తాడు.[1][2] 2022 డిసెంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన భారత పర్యటనలో మొదటి వన్డేలో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[3]
కుల్దీప్ 1996, అక్టోబరు 22న మధ్యప్రదేశ్ రాష్ట్రం, రేవా జిల్లాలోని హరిహర్‌పూర్ గ్రామంలో జన్మించాడు.[4][5] తండ్రి నేరు రామ్ పాల్ సేన్ మంగలి. ఐదుగురు పిల్లలలో మూడవవాడైన కుల్దీప్, తన 8 సంవత్సరాల వయస్సు నుండి క్రికెట్ ఆడటం ప్రారంభించాడు.[6] కోచ్ అరిల్ ఆంథోనీ దగ్గర నేర్చకున్నాడు.[7]
2018-19 రంజీ ట్రోఫీలో 2018 నవంబరు 1న మధ్యప్రదేశ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[8] 2018 నవంబరు 21న, పంజాబ్‌పై ఫస్ట్-క్లాస్ క్రికెట్లో తొలి ఐదు వికెట్లు సాధించాడు.[9] 2019 ఫిబ్రవరి 24న 2018–19 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపున ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[10] 2019-20 విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపున 2019 సెప్టెంబరు 25న లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[11]
2022 సెప్టెంబరులో న్యూజిలాండ్ ఎ క్రికెట్ జట్టుతో 3 మ్యాచ్ ల వన్డే-సిరీస్ కోసం భారతదేశం ఎ జట్టుకు ఎంపికయ్యాడు.[12]
2022 నవంబరులో న్యూజిలాండ్ 3-వన్డే సిరీస్ కోసం భారత జట్టులోకి వచ్చాడు.
2022 డిసెంబరులో భారతదేశం తరపున వన్డేల్లోకి అరంగేట్రం చేసాడు. మూడు మ్యాచ్‌లలో మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఆడాడు. అరంగేట్రంలో తక్కువ స్కోరింగ్‌లో రెండు వికెట్లు తీశాడు.[13]
{{cite web}}
: |last=
has generic name (help)