వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | బాలపువడుగే కుసల్ గిమ్హాన్ మెండిస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | మొరటువా, శ్రీలంక | 1995 ఫిబ్రవరి 2|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | మెండా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి లెగ్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Wicket-keeper-batter | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 132) | 2015 22 అక్టోబర్ - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 16 ఏప్రిల్ - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 170) | 2016 16 జూన్ - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 31 మార్చ్ - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 66) | 2016 8 జూలై - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 5 ఏప్రిల్ - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–2017 | Bloomfield C&AC | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017–present | Colombo Cricket Club | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020 | Kandy Tuskers | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021–present | Galle Gladiators | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | Comilla Victorians | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | Pretoria Capitals | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 5 ఏప్రిల్ 2023 |
బాలపువడుగే కుసల్ గిమ్హాన్ మెండిస్, శ్రీలంక క్రికెటర్. క్రికెట్ లోని రకాల ఫార్మాట్లలో టాప్-ఆర్డర్ బ్యాటర్‌గా ఆడుతాడు.[1] జాతీయ జట్టు కోసం ఆడటానికి ముందు పదహారు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2017 నవంబరులో శ్రీలంక క్రికెట్ వార్షిక అవార్డులలో 2016–17 సీజన్‌లో వన్ డే ఇంటర్నేషనల్ బ్యాట్స్‌మెన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.[2]
బాలపువడుగే కుసల్ గిమ్హాన్ మెండిస్ 1995, ఫిబ్రవరి 2న శ్రీలంకలోని మొరటువాలో జన్మించాడు.
మెండిస్ 2013 సంవత్సరపు స్కూల్‌బాయ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. జాతీయ యువత, మొరటువా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కళాశాల జట్లకు కెప్టెన్‌గా ఉన్నాడు.[1][3][4]
2018 మార్చిలో 2017–18 సూపర్ ఫోర్ ప్రావిన్షియల్ టోర్నమెంట్ కోసం దంబుల్లా జట్టులో ఎంపికయ్యాడు.[5][6] తరువాతి నెలలో 2018 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం దంబుల్లా జట్టులో కూడా ఎంపికయ్యాడు.[7]
1998, ఆగస్టులో మెండిస్ 2018 ఎస్ఎల్సీ టీ20 లీగ్‌లో గాల్లె జట్టులో ఎంపికయ్యాడు.[8] టోర్నమెంట్‌లో గాలె తరపున ఆరు మ్యాచ్‌లలో 182 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.[9] 2019 మార్చిలో 2019 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం గాల్లె జట్టులో ఎంపికయ్యాడు.[10]
2023 ఫిబ్రవరి 7న పార్ల్ రాయల్స్‌తో జరిగిన ఎస్ఏ20లో మెండిస్ 41 బంతుల్లో 8 బౌండరీలు, నాలుగు సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. నాక్ కారణంగా ప్రిటోరియా క్యాపిటల్స్ మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో గెలిచింది, మెండిస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.[11]
మెండిస్ 2014 ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. శ్రీలంక తరపున 132వ టెస్ట్ ఆటగాడు, సోబర్స్-తిస్సెరా ట్రోఫీ రెండవ టెస్టులో తన టోపీని అందుకున్నాడు. వెస్టిండీస్ 2015 శ్రీలంక పర్యటనలో 2వ టెస్ట్‌లో టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 13 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 39 పరుగులు చేశాడు.[12]
ఇంగ్లాండ్ పర్యటన కోసం శ్రీలంక జట్టులో మెండిస్ పేరు పొందాడు. మొదటి టెస్ట్‌లో అతను మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు, కానీ రెండవ ఇన్నింగ్స్‌లో అతను 53 పరుగులతో తన తొలి టెస్ట్ హాఫ్ సెంచరీని సాధించాడు.
మెండిస్ 2016 జూన్ 16న ఐర్లాండ్‌పై వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసాడు, అతని తొలి వన్డే యాభైని సాధించాడు.[13] మెండిస్ అదే పర్యటనలో 2016 జూలై 5న ఇంగ్లాడ్‌పై శ్రీలంక తరపున ట్వంటీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.[14]
2020 జూలైలో పానదురాలో ఘోరమైన రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న మెండిస్‌ని అరెస్టు చేశారు.[15] మెండిస్ వాహనం నడుపుతూ ఒక వృద్ధ సైక్లిస్ట్‌ను ఢీకొట్టగా అతను ఆసుపత్రిలో మరణించాడు.[16] ఈ సంఘటన జరిగిన ఒకరోజు తర్వాత, మెండిస్ బెయిల్‌పై విడుదలయ్యాడు.[17] 2021 ఫిబ్రవరి 12న మెండిస్ కొలంబోలో వివాహం చేసుకున్నాడు.[18] 2022 జూన్ లో మెండిస్ భార్య ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.[19]