పద్మశ్రీ కూటికుప్పల సూర్యారావు | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
విద్య | MBBS,MNAMS,MD,PhD,FHM,FRCP |
విద్యాసంస్థ | ఆంధ్ర మెడికల్ కళాశాల, విశాఖపట్నం |
వృత్తి | వైద్యుడు శాస్త్రవేత్త |
జీవిత భాగస్వామి | శ్రీమతి గృహలక్ష్మి |
పిల్లలు | కూటికుప్పల శృజన, కూటికుప్పల శ్రీచరణ్, కూటికుప్పల శ్రావణ |
తల్లిదండ్రులు | కూటికుప్పల శ్రీరాములు, శ్రీమతి సన్యాసమ్మ |
వెబ్‌సైటు | http://drkutikuppalasuryarao.org/ |
కూటికుప్పల సూర్యారావు హె.ఐ.వి వైద్యంలో ప్రముఖ వైద్యులు. ఆయన శ్రీకాకుళం జిల్లాకు చెందిన పొందూరు మండలానికి చెందిన కింతలి గ్రామానికి చెందినవారు.[1] ఆయన కథా రచయిత.[2]
ఆయన ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎం.బి.బి.ఎస్, కొలంబో విశ్వవిద్యాలయంలో పోస్టుగ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసన్ వద్ద ఎం.డి. ఫామిలీ మెడిసన్ చేసారు. ఆయన హెచ్.ఐ.విలో డాక్టరల్ ఫెలోషిప్ ను వెల్లూరు లోని క్రిస్టియన్ మెడికల్ కళాశాల నుండి చేసారు. తరువాత న్యూఢిల్లీ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి MNAMS పూర్తి చేసారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి హెచ్.ఐ.వీ/ఎయిడ్స్ వైద్యంలో పి.హెచ్.డి చేసారు. ఆయనకు లండన్ లోని రాయల్ కాలేజి ఆఫ్ ఫిజీషియన్స్ నుండి ఫెలోషిప్ లభించింది. ఆయన తన వైద్యజీవితంలో చాలా భాగం హెచ్.ఐ.వీ/ఎయిడ్స్ పరిశోధన కోసం కృషిచేస్తున్నారు.
ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని ఎగ్జిక్యూటివ్ సభ్యులు, జన శిక్షణ సమ్మేళన్ కు వైస్-చైర్మన్,, ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కు నేషనల్ కమిటీ సభ్యుడు. ఆయన అనేక పరిసొధనా పత్రాలను వెలువరించారు. అవి వివిధ జర్నల్స్ లో ప్రచురితమైనాయి. అవి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందాయి.[8]