కె. ఎస్. రవి | |
---|---|
జననం | కె. ఎస్. రవికుమార్ 1958 మే 30[1] |
వృత్తి | సినీ నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1990–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | కర్పగం |
పిల్లలు | జనని, మాళవిక, జశ్వంతి |
కె. ఎస్. రవికుమార్ ఒక ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత, నటుడు. ఎక్కువగా తమిళ సినిమాలకు దర్శకత్వం వహించాడు. నరసింహ, స్నేహం కోసం, దశావతారం, లింగ, జైసింహా, రూలర్[2] (2019) ఆయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు.
రవికుమార్ మొదటగా ఆర్. బి. చౌదరి నిర్మాణంలో విక్రమన్ దర్శకత్వంలో వచ్చిన పుదువసంతం అనే సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అతని పనితనం నచ్చి ఆర్. బి. చౌదరి దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. 1990 లో రహమాన్, రఘువరన్ నటించిన పురియాద పుధిర్ రవికుమార్ కు దర్శకుడిగా తొలిచిత్రం. ఇది తర్క అనే కన్నడ సినిమాకు పునర్నిర్మాణం. రవికుమార్ సాధారణ శైలియైన మసాలా సినిమాలకు భిన్నమైన సినిమా ఇది.[3] .తర్వాత నటుడు విక్రమ్ తో పుదు కావ్యం అనే సినిమా రూపొందించాలనుకున్నాడు కానీ అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత రవికుమార్ గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ సినిమాలు తీయడం తన శైలిగా మార్చుకుని శరత్ కుమార్ తో చేరన్ పాండియన్, నాట్టమై లాంటి విజయవంతమైన సినిమాలు చాలా తీశాడు. దాంతో సినీ పరిశ్రమలో అతను కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.[4]
1995 లో మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ తీసిన తెన్మవిన్ కొంబత్ సినిమాకు రీమేక్ గా తమిళంలో రజనీకాంత్ హీరోగా ముత్తు సినిమా తీశాడు. అది మంచి విజయాన్ని సాధించింది.[5] తర్వాత కమల్ హాసన్ తో కలిసి ఒక అమెరికన్ హాస్య చిత్రం మిసెస్ డౌట్ ఫైర్ సినిమా స్ఫూర్తితో అవ్వై షణ్ముఖి అనే సినిమా తీశాడు. ఇది కూడా విమర్శకుల ప్రశంసలందుకుంది.[6][7] ఇద్దరు ప్రముఖ కథానాయకులతో సినిమాలు తీసి విజయాలు సాధించడంతో రవికుమార్ కు విజయ్ కాంత్, కార్తీక్ లాంటి నటులతో పనిచేసే అవకాశాలు వచ్చాయి.
1998లో రజనీకాంత్ హీరోగా వచ్చిన నరసింహ, చిరంజీవి హీరోగా తమిళ సినిమాకు రీమేక్ చేసిన స్నేహం కోసం, కమల్ హీరోగా తెనాలి, నాగార్జున హీరోగా బావ నచ్చాడు, రాజశేఖర్ హీరోగా విలన్ లాంటి సినిమాలు తీశాడు. తెలుగులో మంచి విజయం సాధించిన భద్ర సినిమాను తమిళంలో శింబు హీరోగా రీమేక్ చేశాడు. 2008 లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన దశావతారం ఒక భారీ బడ్జెట్ సినిమాకు రవి కుమార్ దర్శకత్వం వహించాడు. తెలుగులో 2016లో రెమో సినిమాలో నటించాడు.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)