కె.కె. వేణుగోపాల్ (జననం : 1931) ఈయన సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది. ఈయన భారత అటార్నీ జనరల్‌గా పనిచేశాడు.[1]
ఈయన 1931లో ఆనాటి బ్రిటిష్ ఇండియా మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రస్తుత కేరళలోని దక్షిణ కెనరా జిల్లాలోని కన్హంగాడ్ లో జన్మించాడు. ఈయన తండ్రి, ఎం. కె. నంబియార్ న్యాయవాది. ఈయన చెన్నైలో ఉన్న తంబరంలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ లో భౌతికశాస్త్రంలో తన డిగ్రీ విద్యను పూర్తిచేసాడు. కర్ణాటకలోని బెల్గాం లో రాజా లఖంగౌడ లా కాలేజీ నుంచి లా విద్యను అభ్యసించాడు. ఈయన పురాతన పుస్తకాలను సేకరిస్తాడు.
ఈయన గత 50 సంవత్సరాలలో అనేక ముఖ్యమైన కేసులను వాదించాడు. అందులో భూటాన్ రాజ్యాంగ ముసాయిదా కోసం భూటాన్ రాయల్ ప్రభుత్వం ఈయనను రాజ్యాంగ సలహాదారుగా నియమించింది. బాబ్రీ మసీదు కేసు కూల్చివేత కేసులో బీజెపి నాయకుడు ఎల్.కె అద్వానీ తరఫున వాదించాడు. ఈ కేసులో అద్వానీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషిలతో సహా పలు బీజెపి నాయకులు ఉన్నారు.[2]
ఈయనకు 2015 లో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డును భారత ప్రభుత్వం ప్రదానం చేసింది. 2002 లో మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రదానం చేసింది.
ఈయన 1996 నుండి 1997 వరకు యూనియన్ ఇంటర్నేషనల్ డెస్ అవోకాట్స్ (యుఐఎ - ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్) అధ్యక్షుడిగా పనిచేశాడు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో జూన్ 30, 2017 న భారత అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు.