కె.జి.అంబేగాంకర్

కె.జి.అంబేగాంకర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఐదవ గవర్నరుగా పనిచేసాడు. అతను 1957 జనవరి 14 నుండి 1957 ఫిబ్రవరి 28 వరకు ఈ పదవిలో ఉన్నాడు. అతను ఇండియన్ సివిల్ సర్వీస్ సభ్యుడు. రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నరుగా నియామకానికి ముందు ఆర్థిక కార్యదర్శిగా పనిచేశాడు. [1] బి. రామారావు రాజీనామాతో అతను గవర్నరుగా బాధ్యతలు చేపట్టాడు. అమితావ్ ఘోష్ (20 రోజులు), BN అదార్కర్ (42 రోజులు) ల తర్వాత అతని పదవీకాలమే అతి తక్కువ (45 రోజులు). [1] RBI గవర్నర్‌గా అంబేగావ్‌కర్ సంతకం ఏ నోటుపైనా కనిపించదు. [1] అయితే స్వాతంత్ర్యం తర్వాత జారీ చేసిన రెండవ, మూడవ, నాల్గవ రూపాయి నోట్లపై ఆర్థిక కార్యదర్శిగా అతని సంతకం ఉంటుంది. [2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "List of Governors". Reserve Bank of India. Archived from the original on 16 September 2008. Retrieved 2006-12-08.
  2. Jain, Manik (2009). Indian Paper Money Guide Book 2009. Kolkata: Philatelia. pp. 125, and 126.