కె.జి.రామనాథన్ | |
---|---|
జననం | నవంబరు 13, 1920 హైదరాబాదు, బ్రైటిష్ ఇండియా |
మరణం | మే 10, 1992 (వయస్సు 71) ముంబాయి, భారతదేశము |
నివాసం | కొలాబా |
పౌరసత్వం | భారతీయులు |
రంగములు | నంబర్ థియరీ |
వృత్తిసంస్థలు | TIFR |
చదువుకున్న సంస్థలు | ప్రైన్సెటన్ విశ్వవిద్యాలయం. |
పరిశోధనా సలహాదారుడు(లు) | ఎమిల్ ఆర్టిన్ |
డాక్టొరల్ విద్యార్థులు | సి.పి.రామానుజన్ కనకనహళ్లి రామచంద్ర |
ముఖ్యమైన పురస్కారాలు | పద్మభూషణ |
కొల్లగుంట గోపాల అయ్యర్ రామనాథన్ (నవంబరు 13, 1920 - మే 10, 1992) భారతీయ గణిత శాస్త్రవేత్త. ఆయన గణిత శాస్త్రంలోని "నంబర్ థియరీ"లో ప్రసిధ్దులు. ఆయన రచనలు భారతదేశంలో గణిత శాస్త్ర పరిశోధనల అభివృద్ధికి తోడ్పడినాయి.
కె.జి.రామనాథన్ దక్షిణ భారతదేశం లోని హైదరాబాదులో జన్మించారు. ఆయన హైదరాబాదు నిజాం కళాశాలలో బి.ఎ చదివారు.మద్రాసు లయోలా కాలేజి నుండి ఎం.ఎ (గణిత శాస్త్రం) ను 1942లో చేసారు.తొలుత అన్నామలై విశ్వవిద్యాలయంలో అసిస్టెంటు లెక్చరర్ గా (1945-46), హైదరాబాదు లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గా (1947-48) పనిచేసి పి.హె.డి నిమిత్తం అమెరికా వెళ్లారు. ఆయన అమెరికాలోని ప్రిన్సెటన్ విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి పూర్తిచేసారు. ఆయన డాక్టరల్ అడ్వైజర్ "ఎమిల్ ఆర్టిన్". ఆయన ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో "హెర్మన్ వైల్", "కార్ల్ సైగెల్: లతొ కలసి పనిచేసారు. ఆయన 1951లో భారతదేశానికి తిరిగివచ్చి కొలాబా లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో కె.చంద్రశేఖరన్ బృందంలో పనిచేసారు.
ఆయన జయలక్ష్మీ రామనాథన్ ను వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కుమారులు.వారు అనంత్, మోహన్. కె.జి.రామనాథన్ కు నలుగురు మనుమలు.
TIFR లో ఆయన భారతదేశంలో యువ గణితశాస్త్రవేత్తల బృందంతో కలసి "నంబర్ థియరీ"ని అనేక సంవత్సరాలపాటు అభివృద్ధి చేసారు. ఆయన శ్రీనివాస రామానుజన్ యొక్క ప్రచురించిన, ప్రచురితం కాని పనులపై ఆసక్తి చూపారు. ఆయన "ఆర్కా అరిథెమెటికా"కు 30 సంవత్సరముల పాటు ఎడిటోరియల్ సభ్యునిగా యున్నారు. ఆయన 1985 లోTIFR నుండి పదవీవిరమణ చేసారు.
రామనాథన్ 30 సంవత్సరాల సర్వీసులో అనేక అవార్డులను పొందారు.