![]() కె.డి. సింగ్ బాబు స్టేడియం విహంగ దృశ్యం | |
ప్రదేశం | పరివర్తన్ చౌక్, హజరత్‌గంజ్, లక్నో |
---|---|
యజమాని | ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ |
ఆపరేటర్ | ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ |
వాడుతున్నవారు | ఉత్తర ప్రదేశ్ క్రికెట్ జట్టు భారత క్రికెట్ జట్టు States United FC (Football Association) White Eagle FC (Football Association) |
KD సింగ్ బాబు స్టేడియం, ప్రసిద్ధ హాకీ ఆటగాడు కె.డి సింగ్ పేరు మీద ఉన్న ఒక బహుళ ప్రయోజన స్టేడియం. దీన్ని గతంలో సెంట్రల్ స్పోర్ట్స్ స్టేడియం అనేవారు.[1] ఈ స్టేడియాన్ని 1957లో 25,000 మంది సీటింగ్ సామర్థ్యంతో నిర్మించారు. నగరం నడిబొడ్డున లక్నో డౌన్‌టౌన్‌లోని రద్దీగా ఉండే హజ్రత్‌గంజ్ ప్రాంతానికి సమీపంలో ఉంది. డే నైట్ మ్యాచ్‌లు జరిపేందుకు ఫ్లడ్‌లైట్లు లేవు. ఈ స్టేడియం ఉత్తర ప్రదేశ్ క్రికెట్ జట్టుకు హోమ్ గ్రౌండ్.[2]]
స్టేడియంలో దేశీయ పోటీలను క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. అనేక అంతర్జాతీయ, జాతీయ ఫీల్డ్ హాకీ మ్యాచ్‌లు ఇక్కడ జరిగాయి. ఇప్పుడు దేశీయ, కొన్ని అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు కూడా ఉపయోగిస్తున్నారు. లక్నోలోని డిస్ట్రిక్ట్ ఫుట్‌బాల్ లీగ్ మ్యాచ్‌ల వంటి అసోసియేషన్ ఫుట్‌బాల్ ఆటలకు కూడా స్టేడియం కొన్నిసార్లు ఉపయోగించబడుతుంది. 2012లో, వైట్ ఈగిల్ క్లబ్‌ను ఓడించి సహారా FC టోర్నమెంట్‌ను గెలుచుకుంది. యుపి పోలీస్, సన్‌రైజ్ క్లబ్ ఆ సంవత్సరం దిల్‌కుషా గ్రౌండ్స్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాయి.
KD సింగ్ బాబు స్టేడియంలో క్రింది సౌకర్యాలున్నాయి.[3]
KD సింగ్ బాబు స్టేడియంలో క్రింది అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి:
మహిళల క్రికెట్‌లో, ఇంగ్లండ్‌కు చెందిన ఓపెనింగ్ బ్యాటర్లు కరోలిన్ అట్కిన్స్, అర్రాన్ బ్రిండిల్ (అర్రాన్ థాంప్సన్) లు భారత్‌తో జరిగిన తొలి టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 150 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు ఓపెనింగ్ భాగస్వామ్యానికి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు.[8][9][10]
టెస్టు క్రికెట్‌లో ఇక్కడ భారత్ చేసిన అత్యధిక స్కోరు 511 ఆలౌట్. ఆ తరువాత శ్రీలంక 218 ఆలౌట్. తదుపరి అత్యధిక స్కోరు కూడా శ్రీలంకే చేసిన 174 పరుగులు. ఇక్కడ అత్యధిక పరుగులు చేసిన వారిలో సచిన్ టెండూల్కర్ (142 పరుగులు), తర్వాత నవజ్యోత్ సిద్ధూ (124 పరుగులు), రోషన్ మహానామా (118 పరుగులు) ఉన్నారు. అత్యధిక వికెట్లు తీసిన వారిలో అనిల్ కుంబ్లే (11 వికెట్లు), ఆ తర్వాతి స్థానాల్లో ముత్తయ్య మురళీధరన్ (5 వికెట్లు), వెంకటపతి రాజు (3 వికెట్లు) ఉన్నారు.[11]
వన్‌డేలలో పాకిస్థాన్ చేసిన 219–6 ఇక్కడి అత్యధిక స్కోరు. శ్రీలంక చేసిన 213 ఆ తర్వాతి అత్యధిక స్కోరు. ఇక్కడ అత్యధిక పరుగులు ఇమ్రాన్ ఖాన్ (84 పరుగులు), అరవింద డి సిల్వా (83 పరుగులు), హషన్ తిలకరత్నే (71 పరుగులు) చేసారు. వన్డేల్లో ఈ మైదానంలో వసీం అక్రమ్, అబ్దుల్ ఖాదిర్, అక్రమ్ రెజా తలా 2 వికెట్లు తీశారు.