కోలార్ వెంకటేశ అయ్యర్ (కె.వి.అయ్యర్) (1900? (1898) - 1980) ప్రముఖ కన్నడ రచయిత. భారతదేశంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రపంచప్రసిధ్ధి చెందిన వస్తాదు (body builder). ప్రొఫెసర్ అయ్యర్ అని పిలువబడే ఈయన 1930య్యో దశకంలో ప్రపంచంలోనే అత్యుత్తమమైన వస్తాదులలో ఒకరు.
కె.వి.అయ్యర్ 1898లో కోలార్ జిల్లా, దేవరాయసముద్రములో జన్మించారు. ఈయన ఎస్.ఎస్.ఎల్.సి వరకు మాత్రమే చదువుకున్నారు. అయ్యర్ శుధ్ధశాకాహారి. అధ్బుతమైన దేహధారుఢ్యం, శరీరాకృతి సాధించటానికి మాంసాహారం అవసరంలేదని ఆయన నిరూపించారు. ప్రొ.అయ్యర్‌కు వైద్యవిద్యలో కూడా ప్రవేశం ఉండేది. ఆయన ఆనాటి మైసూరు మహారాజు కృష్ణరాజేంద్ర వొడియార్ యొక్క ఆస్థాన వైద్యులుగా కూడా పనిచేశారు. అధ్బుతమైన భంగిమలలో ఆయన చిత్రాలు విదేశీ పత్రికలలో ప్రచురింపబడినప్పుడు, ఆయా దేశాలలో ప్రముఖులెందరో ప్రొ.అయ్యర్ దేహధారుఢ్యాన్ని, అద్వితీయమైన శరీరాకృతినీ మెచ్చుకున్నారు.
1935వ సంలో బెంగుళూరు నగరంలో హెర్క్యూలెస్ జిమ్నాసియం అనే పేరుతో ఒక వ్యాయామశాలను స్థాపించి వందల సంఖ్యలో ఔత్సాహికులను ఆకర్షించారు. దేహధారుఢ్యం పెంచుకోవాలనుకునే ఔత్సాహికులకొరకు ఆయన దూరవిద్య పాఠాలను కూడా ప్రారంభించారు. ఈ వ్యాయామశాలలోనే మరో ప్రముఖ కన్నడ రచయిత టి.పి.కైలాసం అధ్యాపకునిగా పనిచేశారు.
ఆ తరువాత కాలములో రచనా వ్యాసాంగాన్ని చేపట్టిన అయ్యర్ శంతల, రూపదర్శి, దెప్పద మానె వంటి ప్రసిద్ధ రచనలు చేశారు. ఈయన చిన్నకథల సంపుటము సముద్యత అన్న పేరుతో ప్రచురించబడింది. రూపదర్శి, అయ్యర్ ఒక పాత రీడర్స్ డైజెస్ట్ సంచికలో చదివిన ది ఫేస్ ఆఫ్ జూడాస్ ఇస్కరియాట్ పై అధారితము. నాటక రంగముపై కూడా ఆసక్తి ఉన్న అయ్యర్ రవి కళావిదరు అనే నాటక సంస్థను స్థాపించి అధ్యక్షత వహించారు. ఇవే కాకుండా ఈయన అంగసాధన (బాడీ బిల్డింగు) పై ఆంగ్లములో నాలుగు పుస్తకాలు రచించారు. అయ్యర్ వేదాంత ధోరణిలో యొగా, హిందూ తత్వాలను పాశ్చత్య అంగసాధన సిధ్దాంతాలతో మేళవించేవారు.
కె.వి.అయ్యర్, 1980, జనవరి 3న బెంగుళూరులో మరణించారు.[1]
అంగసాధన (బాడి బిల్డింగ్) పై రచనలు: