కృష్ణ చంద్ర పంత్ | |
---|---|
18వ భారత రక్షణ మంత్రి | |
In office 1987–1989 | |
23వ డిప్యూటీ ఛైర్మన్, భారత ప్రణాళికా సంఘం[1] | |
In office 1999–2004 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | భోవాలి, యునైటెడ్ ప్రావిన్సెస్, బ్రిటిష్ ఇండియా | 1931 ఆగస్టు 10
మరణం | 2012 నవంబరు 15 ఢిల్లీ, భారతదేశం | (వయసు 81)
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ & భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | ఇలా పంత్ |
సంతానం | 2 |
కృష్ణ చంద్ర పంత్ (1931ఆగస్టు 10 - 12012 నవంబరు 15) 26 సంవత్సరాలు భారత పార్లమెంటు సభ్యుడుగా పనిచేసాడు. అతను కాశ్మీర్‌పై ప్రధానమంత్రికి సంభాషణకర్త.[2] అతను భారత ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి, 37 సంవత్సరాల కాలంలో పలు రాజ్యాంగ పదవులను నిర్వహించాడు. పంత్ రక్షణ మంత్రి, హోం శాఖ సహాయ మంత్రి, ఉక్కు, భారీ ఇంజినీరింగ్, ఆర్థిక, అణుశక్తి, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి పదవులను నిర్వహించాడు.[3] అతను అణుశక్తి సలహా సంఘానికి మొదటి అధ్యక్షుడు, 10వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు, భారతదేశ ఆర్థిక ప్రణాళికా సంస్థ ఉపాధ్యక్షుడు పదవులు నిర్వహించాడు. అతని ముందుచూపుపై 2020 డాక్యుమెంట్ ఇండియాస్ డెవలప్‌మెంట్ సినారియో, నెక్స్ట్ డికేడ్ అండ్ బియాండ్ అని ప్రచురించారు.[4]
కృష్ణ చంద్ర పంత్ (కెసి పంత్) ను అనధికారికంగా "రాజా" అని పిలుస్తారు, ఇతను స్వాతంత్ర్య సమరయోధుడు. గోవింద్ బల్లభ్ పంత్ [3] కళావతి పంత్ దంపతులకు 1931 ఆగస్టు 10న న హిమాలయాలలోని భోవాలి - కుమావోన్ (యునైటెడ్ ప్రావిన్సెస్ ప్రస్తుతం ఉత్తరాఖండ్) ప్రాంతంలో జన్మించాడు. అతని ప్రారంభ సంవత్సరాలు నైనిటాల్‌లో గడిచాయి. అతని పాఠశాల విద్య నైనిటాల్ లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో సాగింది. స్వాతంత్ర్యానంతరం తన తండ్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులైనప్పుడు, అతను లక్నో వెళ్లాడు. అతను లక్నో విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్య పూర్తి చేసి తదుపరి చదువుల కోసం జర్మనీ దేశం వెళ్ళాడు. 1957లో నైనిటాల్‌లో ఇలా పంత్‌ను వివాహం చేసుకున్నాడు.
1970వ దశకం ప్రారంభంలో, నైనిటాల్ నుండి లోక్‌సభ పార్లమెంటరీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత, అతను హోం వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా తన మొదటి మంత్రి పదవిని స్వీకరించాడు.[5] ఆసమయంలో రెండు క్లిష్టమైన సమస్యలను పరిష్కరించాడు.ముందుగా ఆంధ్రా-తెలంగాణ ఒకే రాష్ట్రంగా కొనసాగించాలని చర్చలు జరిపాడు.[6] రెండవది మేఘాలయ రాష్ట్రానికి పూర్తి హోదా కల్పించడం వల్ల, అల్లకల్లోలంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలకు అతను సహాయం చేశాడు.[7]
పంత్ 1985లో విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యాడు.అతని పదవీ కాలంలో అంధుల కోసం విద్య, సామూహిక అక్షరాస్యత ప్రచారం, ఉద్యోగాలకు డిగ్రీ ఉండాలనే నిబంధనలు తొలగించడం, అందరికీ విద్య, అన్ని జిల్లాలకు మాదిరి పాఠశాలలు, కొన్నిముఖ్య ఉద్యోగ ఆధారిత కార్యక్రమాలు వంటి కొన్ని ప్రధాన ప్రచారాలతో ముందుకు వెళ్లాడు. ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్యను అందించే సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రతిపాదనను సమర్పించి, ఆమోదించటానికి కృషిచేసాడు.దానికి ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ - ఇగ్నో అని పేరు పెట్టారు.[8]
పంత్ 1987-89 సంవత్సరాల్లో కేంద్ర రక్షణ మంత్రిగా చేసాడు.రష్యా, యుఎస్, ఇతర దేశాలతో విదేశీ సంబంధాలను మెరుగుపరచడం, రక్షణ పరికరాలు, సేవలను అప్‌గ్రేడ్ చేయడం, వాటిని స్వయంసమృద్ధిగా మార్చడంవంటివాటిని పంత్ చేపట్టిన ప్రధాన కార్యక్రమాలు. అగ్ని, పృథ్వీ క్షిపణి కార్యక్రమాలలో కూడా అతని ప్రధాన పాత్ర ఉంది.[9][10][11]
10వ ఆర్థిక సంఘం [12] ఛైర్మన్‌గా పంత్‌ను అప్పటి ప్రధానమంత్రి పివి నర్సింహారావు నియమించాడు.యూనియన్, రాష్ట్రాల మధ్య అదనపు ఎక్సైజ్ సుంకాలు మొదలైన వాటిపరంగా నికర ఆదాయానికి సంబంధించిన పంపిణీకి సిఫార్సులు, మార్పులను సూచించడం వంటి ఇతర కార్యకలాపాలతో పాటు రాష్ట్రాలకు వారి ఆదాయాన్ని పెంచడానికి కేటాయించిన గ్రాంట్స్-ఇన్-ఎయిడ్‌కు సంబంధించిన నిబంధనలపై అతను అవసరమైన బాధ్యతలు వహించాడు.
జాతీయ భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా, జాతీయ భద్రతా ప్రణాళిక నిర్వహణకు కోసం సమన్వయంతో కూడిన ఇంటెలిజెన్స్ మదింపు, సత్వర నిర్ణయాలు తీసుకోవడం, విధాన అమలు అనుసరణల సమన్వయం కోసం దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రణాళికలు, జాతీయ భద్రత వ్యూహాన్ని రూపొందించడానికి పంత్ బాధ్యత వహించాడు.[13]
2000 ఏప్రిల్ 11 న పంత్ హయాంలో జనాభా నియంత్రణ ఉద్దేశంతో, జాతీయ జనాభా విధానం, అమలు చేయబడింది [14]
ప్రణాళికా సంఘానికి అప్పటి ప్రధాని ఎబి వాజ్‌పేయి నేతృత్వం వహించగా, కెసి పంత్‌ను డిప్యూటీ చైర్మన్‌గా నియమించారు.[15] ఆకలి రహిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అతను తన కమిటీ సభ్యులతో కలిసి వ్యవసాయాభివృద్ధిపై దృష్టి సారించాడు. ఆహార భద్రతను నిర్ధారించడానికి, అతను ఆహార ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి, వ్యవసాయ రంగంలో ఉపాధి, ఆదాయాన్ని పెంచడానికి వ్యూహాలను రూపొందించి అమలు చేశాడు. పేదరిక నిర్మూలన పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాడు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ చేయడం ప్రారంభించాడు.అతని పదవీ కాలంలో ఇతర రంగాలపై కూడా దృష్టి సారించాడు. విద్యా రంగంలో, విద్యలో సామాజిక మౌలిక సదుపాయాల విస్తరణ, మెరుగుదల కోసం ప్రధాని మంత్రి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో పెట్టుబడి పెట్టటానికి కృసిచేసాడు. ఆ తర్వాత దేశంలో ఉపాధిని పెంచేందుకు చర్యలు చేపట్టాడు. పారిశ్రామిక, రైల్వే, టెలికమ్యూనికేషన్ రంగాల పనితనాన్ని, వాటి నిర్వహణ పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకున్నాడు. 2004 జనవరి 1న పంత్ డిప్యూటీ ఛైర్మన్‌గా, ప్రణాళికా సంఘం తన అధికారిక ప్రకటనలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 8% వద్ద ఉందని ధ్రువీకరించింది.[16]
2012 నవంబరు 15న కెసి పంత్ 81 సంవత్సరాల వయస్సులో మరణించాడు.[17][18][19]