Total population | |
---|---|
4,97,000 (2011) కెనడా జనాభాలో1.45% | |
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు | |
అంటారియో | 3,66,720 |
బ్రిటిష్ కొలంబియా | 45,795 |
ఆల్బెర్టా | 36,845 |
క్విబెక్ | 33,540 |
మనిటోబా | 7,720 |
భాషలు | |
అధికారిక ఇంగ్లీషు, ఫ్రెంచి ఇంట్లో హిందీ •పంజాబీ •గుజరాతీ •బెంగాలీ •తమిళం మరాఠీ •తెలుగు •కన్నడం •ఇతర భారతీయ భాషలు మతపరంగా సంస్కృతం | |
మతం | |
హిందూమతం |
కెనడాలో హిందూమతాన్ని దేశం మొత్తం జనాభాలో దాదాపు 1.5% మంది అనుసరిస్తున్నారు. [1] As of 2011[update]దాదాపు 497,000 మంది కెనడియన్లు హిందూమతాన్ని అవలంబిస్తున్నారు. [2] కెనడియన్ హిందువులు సాధారణంగా మూడు సమూహాలలోకి వస్తారు. మొదటి సమూహం ప్రధానంగా 110 సంవత్సరాల క్రితం బ్రిటిష్ కొలంబియాకు చేరుకోవడం ప్రారంభించిన భారతీయ వలసదారుల వారసులతో కూడుకున్నది. [3] భారతదేశం నలుమూలల నుండి హిందువుల వలసలు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అతిపెద్ద భారతీయ ఉప జాతి సమూహాలు గుజరాతీలు, పంజాబీలు. [4] [5] ఈ మొదటి వలసదారులలో ఫిజీ, మారిషస్, దక్షిణాఫ్రికా, గయానా, ట్రినిడాడ్ టొబాగో, సూరినామ్, తూర్పు ఆఫ్రికా వంటి యూరోపియన్ వలస పాలనలో ఉన్న దేశాల నుండి వచ్చిన భారతీయ సంతతికి చెందిన హిందూ వలసదారులు కూడా ఉన్నారు. [6] హిందువులలో రెండవ ప్రధాన సమూహం బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక నుండి వలస వచ్చినవారు. శ్రీలంక హిందువుల విషయానికొస్తే, కెనడాలో వారి చరిత్ర 1940ల నాటిది, కొన్ని వందల మంది శ్రీలంక తమిళులు కెనడాకు వలస వచ్చారు. [7] శ్రీలంకలో 1983 మతపరమైన అల్లర్లు కెనడా, UK, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వంటి దేశాలలో 5,00,000 మందికి పైగా ఆశ్రయం పొందడంతో తమిళుల భారీ వలసలకు దారితీసింది. అప్పటి నుండి, శ్రీలంక తమిళులు ముఖ్యంగా టొరంటో, గ్రేటర్ టొరంటో ఏరియా లోకి వలస వచ్చారు. గత 50 సంవత్సరాలలో హరే కృష్ణ ఉద్యమం, వారి గురువుల ప్రయత్నాల ద్వారా హిందూ మతంలోని వివిధ విభాగాలలోకి మారిన కెనడియన్లు మూడవ సమూహం లోకి వస్తారు. [8] [9]
2011 జనాభా లెక్కల ప్రకారం, కెనడాలో 4,97,200 మంది హిందువులు ఉన్నారు, 2001 జనాభా లెక్కల ప్రకారం 2,97,200 మంది ఉండేవారు. [2]
చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1971 | 9,790 | — |
1981 | 69,505 | +610.0% |
1991 | 1,57,015 | +125.9% |
2001 | 2,97,200 | +89.3% |
2011 | 4,97,200 | +67.3% |
సంవత్సరం | శాతంలో పెరుగుదల | పెరుగుదల | పెరుగుదల శాతం |
---|---|---|---|
1971 | 0.05% | - | |
1981 | 0.28% | +0.23% | 460% |
1991 | 0.56% | +0.28% | 100% |
2001 | 0.96% | +0.40% | 92% |
2011 | 1.45% | +0.49% | 51% |
2011 జాతీయ గృహ సర్వే ప్రకారం కెనడాలోని హిందూ జనాభా. [2]
2011 నేషనల్ హౌస్‌హోల్డ్ సర్వే ప్రకారం ఫెడరల్ ఎలక్టోరల్ డిస్ట్రిక్ట్ ద్వారా కెనడాలోని హిందూ జనాభా. [2]
1. బ్రాంప్టన్ ఈస్ట్ - 19.5%2. స్కార్‌బరో-రూజ్ పార్క్ - 18.6%3. మార్కమ్—థోర్న్‌హిల్ - 16.8%4. స్కార్‌బరో-గిల్డ్‌వుడ్ - 16.2%5. స్కార్‌బరో నార్త్ - 14.5%6. ఎటోబికోక్ నార్త్ - 14.4%7. స్కార్‌బరో సెంటర్ - 13.2%8. మిస్సిసాగా—మాల్టన్ - 12.8%9. బ్రాంప్టన్ వెస్ట్ - 11.8%10. బ్రాంప్టన్ నార్త్ - 10.9%
1. సర్రే—న్యూటన్ - 6.2%2. సర్రే సెంటర్ - 4.9%3. వాంకోవర్ సౌత్ - 3.4%4. ఫ్లీట్‌వుడ్—పోర్ట్ కెల్స్ - 3.3%5. డెల్టా - 3.0%6. వాంకోవర్ కింగ్స్‌వే - 2.5%7. బర్నబీ సౌత్ - 2.4%
1. ఎడ్మంటన్ మిల్ వుడ్స్ - 4.8%2. కాల్గరీ స్కైవ్యూ - 4.5%3. ఎడ్మంటన్ రివర్‌బెండ్ - 3.0%4. కాల్గరీ ఫారెస్ట్ లాన్ - 2.2%5. కాల్గరీ నోస్ హిల్ - 1.9%
1. పాపినో - 4.3%2. పియర్‌ఫాండ్స్—డాలర్డ్ - 4.0%3. సెయింట్-లారెంట్ - 3.2%
1. విన్నిపెగ్ సౌత్ - 3.0%
ప్రారంభ హిందువులు చాలా ప్రతికూల వాతావరణంలో తమ మత సంప్రదాయాలను కొనసాగించారు. బ్రిటిషు సంస్కృతికి, ఆ కాలపు జీవన విధానానికీ ఈ ఇది నలుపు రంగు వలసదారులను ముప్పుగా భావించారు. [3] 1930 ల వరకు ఈ మగ వలసదారులు భారతదేశం లోని స్త్రీలను పెఖ్ఖి చేసుకునే వీలు ఉండేది కాదు. 1947 వరకు ఎన్నికలలో ఓటు హక్కు కూఏడా ఉండేది కాదు. మతపరమైన జీవితమంతా ఇళ్ల లోను, సంఘ సభ్యులు నిర్వహించే సమూహిక భజనల్లోనూ మాత్రమే పరిమితమై ఉండేది. [10]
1960ల నుండి అనేక మంది పాశ్చాత్యులు హిందూమతంతో సహా ఆసియా మత వ్యవస్థలలో ప్రదర్శించబడిన ప్రపంచ దృష్టికోణానికి ఆకర్షితులయ్యారు. [11] దీనికి కెనడా మినహాయింపేమీ కాదు. ఇస్కాన్, ఆర్యసమాజ్, ఇతర మిషనరీ సంస్థల చర్యలతో పాటు వివాదాస్పదమైన ప్రముఖ్ స్వామి మహారాజ్, సత్యసాయి బాబా, వివాదాస్పద రజనీష్ వంటి భారతీయ గురువుల సందర్శనలు, మార్గదర్శకత్వం కారణంగా వివిధ జాతులకు చెందిన అనేక మంది స్థానిక కెనడియన్లు గత 50 సంవత్సరాలలో మతం మారారు. [12] [13]
కెనడియన్ ఇమ్మిగ్రేషన్ విధానాల సరళీకరణ కారణంగా మారిషస్, ఫిజీ, ట్రినిడాడ్ టొబాగో, గయానా, సూరినామ్, మలేషియా, సింగపూర్, దక్షిణాఫ్రికా వంటి హిందూ భారతీయ డయాస్పోరిక్ కమ్యూనిటీల నుండి, భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, ఇండోనేషియా ల నుండి, కెన్యా, ఉగాండా, టాంజానియా వంటి తూర్పు ఆఫ్రికా దేశాల నుండీ చాలా మంది హిందువులు 1960ల నుండి మాంట్రియల్, టొరంటో, కాల్గరీ, వాంకోవర్ మహానగరాలకు చేరుకున్నాయి. [14] గత 20 ఏళ్లలో నేపాల్ నుండి చాలా మంది హిందువులు కెనడాకు వలస వచ్చారు. కెనడాలో సుమారు 8000 నుండి 10000 మంది నేపాలీ హిందువులు నివసిస్తున్నారని అంచనా వేసారు, వారు ప్రధానంగా టోరంటో, కాల్గరీ, వాంకోవర్, ఎడ్మోంటన్, మాంట్రియల్‌లలో ఉన్నారు. కెనడా ప్రభుత్వం 2012 నాటికి నేపాల్ జాతికి చెందిన 6500 మంది భూటాన్ శరణార్థులకు పునరావాసం కల్పిస్తామని ప్రతిజ్ఞ చేసింది. భూటాన్ నేపాలీలలో ఎక్కువ మంది హిందువులు. 2014 నాటికి లేత్‌బ్రిడ్జ్ లో అతిపెద్ద భూటానీస్ సమాజం ఉంది. [15] దాదాపు 6,600 మంది భూటానీస్ నేపాలీలు 2015 చివరి నాటికి కెనడాలో స్థిరపడ్డారు. వీరికి లోత్షాంపా అని పేరు. 2016 ఆగస్టు నాటికి లేత్‌బ్రిడ్జ్‌లో దాదాపు 1,300 మంది ఉన్నారు [16]
ఈ సంఘాలు దేశవ్యాప్తంగా 1,000 దేవాలయాల సొసైటీలను ఏర్పాటు చేశాయి. ఇవి కమ్యూనిటీ సంస్థలను నిర్వహిస్తాయి. వీటిలో కొన్ని సంఘాలు చాలా మంది హిందూ విద్యార్థులు వెళ్లే మత రహిత, క్యాథలిక్ పాఠశాల బోర్డులతో పోటీ పడుతూ తమిళ ప్రైవేట్ పాఠశాలలను కూడా స్థాపించాయి. [17]
కెనడాలోని తొలి హిందూ దేవాలయాలలో ఒకటి 1971లో కేప్ బ్రెటన్ దీవులకు సరిహద్దు సమీపంలో, ఆల్డ్స్ కోవ్‌లోని గ్రామీణ నోవా స్కోటియాలో స్థాపించబడింది. నోవా స్కోటియాలోని హిందూ సంస్థ ఆ సమయంలో ఆ ప్రాంతంలో నివసించిన దాదాపు 25 కుటుంబాల వారు కలిసి స్థాపించారు. శ్రీకృష్ణుడు ప్రాథమిక దేవత. సిడ్నీ, యాంటిగోనిష్, న్యూ గ్లాస్గో, హాలిఫాక్స్‌లోని భారతీయ సమాజ కుటుంబాలు హిందూ పండుగలను జరుపుకోవడానికి తరచుగా సమావేశమవుతారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న బహుళ-సాంస్కృతిక జనాభాలో, పండుగలలో పాల్గొనడానికి విభిన్న విశ్వాసాలకు, సంస్కృతులకూ చెందిన ప్రతి ఒక్కరినీ ఆలయం స్వాగతిస్తుంది.
కెనడాలో అతిపెద్ద హిందూ దేవాలయం, టొరంటో లోని BAPS శ్రీ స్వామినారాయణ మందిర్. దీనిలో రెండు వేర్వేరు భవనాలున్నాయి - వాటిలో ఒకటి అలయం, మరొకటి పెద్ద సమావేశ మందిరం. ఇక్కడ అనేక మతపరమైన పుస్తక దుకాణాలు, ఒక చిన్న ప్రార్థన గది, దేశంలోని అతిపెద్ద ఇండో-కెనడియన్ మ్యూజియం, వాటర్ ఫౌంటెన్, ఒక పెద్ద వ్యాయామశాల ఉన్నాయి. హిందూ సంప్రదాయాలను ఉపయోగించి నిర్మించిన ఏకైక మందిరం ఇది. దీన్ని సాంప్రదాయిక శిఖరబద్ధ మందిరం శైలిలో శిల్ప శాస్త్రాలలో నిర్దేశించబడిన సూత్రాలకు అనుగుణంగా నిర్మించారు. [18] 2007లో ప్రారంభించిన ఈ ఆలయాన్ని నిర్మించడానికి $40 మిలియన్లు పట్టింది. ఆలయం మొత్తం వైశాల్యం 32,000 sq ft (3,000 మీ2) . [19]
కెనడాలో హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహించే అనేక సంస్థలు ఉన్నాయి. వాటిలో హిందూ కెనడియన్ నెట్‌వర్క్ అత్యంత ప్రముఖమైన ఛత్ర సంస్థ. [20] [21]
2013లో అంగస్ రీడ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన సర్వే ప్రకారం, 42% మంది కెనడియన్లు హిందూమతం పట్ల అనుకూలమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. 2016 సర్వేలో అది 49%కి పెరిగింది. 2017 ఫిబ్రవరిలో మీ పిల్లల్లో ఒకరు హిందువును పెళ్లి చేసుకుంటే అది మీకు ఆమోదయోగ్యమా కాదా అనే ప్రశ్నకు, 2013 సెప్టెంబరులో ఆమోదనీయమే అని 37% మంది చెప్పగా, 2017 ఫిబ్రవరిలో 54% మంది కెనడియన్లు ఆమోదనీయమేనని చెప్పారు.
అంగస్ రీడ్ ఇన్స్టిట్యూట్ చేసిన మరొక సర్వే ప్రకారం, 32% మంది "కెనడా, కెనడియన్ ప్రజా జీవితంలో" హిందూమతం ప్రభావం పెరుగుతోందని చెప్పారు. అయితే, చాలా మంది కెనడియన్లు (67%) హిందూమతం గురించి "ఏమీ తెలియదు/అర్థం చేసుకోలేదు" అని చెప్పారు. 4% మంది మాత్రం "చాలా బాగా అర్థం చేసుకున్నారు". [22]
కెనడాలోని హిందువులు మతపరమైన పద్ధతులను అనుసరించే సంఘాలను సృష్టించడమే కాకుండా, విద్య, సలహాలు, మద్దతు, ఔట్రీచ్ సేవలను కూడా అందిస్తారు. ఈ సమాజాలు, కెనడాకు వలస వచ్చిన హిందువులు అక్కడి పరిస్థితులకు తేలిగ్గా అలవాటు పడడంలో సహకరిస్తాయి. [23] హిందూ వలసదారులు వారి వారసులూ తమ మూలస్థానాల నుండి స్థానభ్రంశం చెందినప్పటికీ తమ సంస్కృతిని, గుర్తింపునూ కాపాడుకోవడానికీ తమ మూల దేశంతో భౌతిక, మానసిక సంబంధాలను కొనసాగించడానికీ హిందూ సమాజాలు వీలు కల్పిస్తాయి. తమ మూల దేశం నుండి బహిష్కరణకు గురైన వలసదారుల విషయంలో తమ జాతీయ, సాంస్కృతిక గుర్తింపు నుండి వేరు చేయబడినట్లు భావిస్తారు కాబట్టి ఇది మరీ ముఖ్యం.
హిందువులు సాధారణంగా కెనడాలోని రాజకీయ కేంద్రాలతో సంబంధం పెట్తుకోరు. రాజకీయ నాయకుల దృష్టి వీరిపై అంతగా ఉండదు కూడా. దీపక్ ఓబ్రాయ్ కెనడాలోని ఏకైక హిందూ ఎంపీ. [24] దీపికా దామెర్ల, హిందూ సమాజం నుండి ప్రావిన్షియల్ క్యాబినెట్ మంత్రి అయిన తొలి వ్యక్తి. [25] ఇతర హిందూ రాజకీయ నాయకులు: విమ్ కొచర్ (సెనేట్‌కు నియమితులైన మొదటి హిందువు), [26] రాజ్ షెర్మాన్ (కెనడియన్ రాజకీయ పార్టీకి నాయకత్వం) [27] బిధు ఝా (మానిటోబా శాసనసభకు ఎన్నికైన మొదటి హిందువు). [28]
అనితా ఆనంద్ కెనడాలో మొదటి హిందూ క్యాబినెట్ మంత్రి. ఆమె 2019లో క్యాబినెట్ మంత్రి అయింది [29]
{{cite web}}
: CS1 maint: url-status (link)
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)