కెన్యాలో హిందూ మతం మైనారిటీ మతం. దేశ జనాభాలో 0.13% మంది హిందువులు. [1] హిందూ కౌన్సిల్ ఆఫ్ కెన్యా చేసిన ప్రయత్నాల కారణంగా, కెన్యా హిందూ మతాన్ని ఒక మతంగా గుర్తించింది. అలా గుర్తించిన మూడు ఆఫ్రికా దేశాలలో కెన్యా ఒకటి. [2] కెన్యాలో హిందువులకు తమ మతాన్ని ఆచరించడానికి స్వేచ్ఛగా ఉంది. అనేక కెన్యా నగరాల్లో హిందూ దేవాలయాలు ఉన్నాయి . [3] కెన్యాలోని హిందూ దేవాలయాలు ఎక్కువగా ఉత్తర, పశ్చిమ భారతీయ నిర్మాణ శైలిలో ఉన్నాయి.
కెన్యాలో హిందూమతం ప్రధానంగా గుజరాత్, మార్వార్, ఒడిషా, దక్షిణ భారతదేశం లోని చోళ సామ్రాజ్యం లకు, తూర్పు ఆఫ్రికాకూ మధ్య ఉన్న తీరప్రాంత వాణిజ్య మార్గాల గుండా వచ్చింది.
తూర్పు ఆఫ్రికాకు, భారత ఉపఖండానికీ మధ్య వాణిజ్యం ఉన్నప్పుడు కెన్యాలో హిందూమతం ప్రభావం సా.శ.. 1వ సహస్రాబ్ది AD ప్రారంభంలో మొదలైంది. [4] చిన్నచిన్న హిందూ ఆవాసాలకు సంబంధించిన పురావస్తు ఆధారాలు ప్రధానంగా జాంజిబార్, కెన్యా, స్వాహిలి తీరం, జింబాబ్వే, మడగాస్కర్ తీర ప్రాంతాలలో కనుగొన్నారు. [5] స్వాహిలి భాషలోని అనేక పదాలకు హిందూమతంతో ముడిపడి ఉన్న భారతీయ భాషలలో శబ్దవ్యుత్పత్తి మూలాలు ఉన్నాయి. కెన్యా గుజరాతీల మూలం 1800ల చివరలో (1900ల ప్రారంభంలో), బ్రిటీష్ వలసవాదులు ఉగాండా-కెన్యా రైల్వేను నిర్మించడానికి భారతదేశం నుండి కార్మికులను తీసుకువచ్చినప్పుడు మొదలైంది. చాలా మంది కార్మికులు, భారత ఉపఖండానికి తిరిగి వెళ్లకుండా, కెన్యాలోనే స్థిరపడి పోయారు. నెమ్మదిగా తమతో పాటు అనేక మంది ఆశావహులను కూడా తీసుకువచ్చారు.
IRF నివేదిక ప్రకారం కెన్యా జనాభాలో ఒక శాతం మంది హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. [6] 2019 జనాభా లెక్కల ప్రకారం, కెన్యాలో 60,287 మంది హిందువులు ఉన్నారు. ఇది దేశ జనాభాలో 0.13% . [7]
ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనాల ప్రకారం 2010లో కెన్యాలో 60,000 మంది హిందువులు లేదా మొత్తం కెన్యా జనాభాలో 0.25% కంటే తక్కువ మంది ఉన్నారు. [8]
నేడు, కెన్యాలోని గుజరాతీ కమ్యూనిటీ తొంభై వేలకు పైగా ఉంటుందని అంచనా వేసారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. వివిధ స్థాయిల్లో సాంస్కృతిక సమ్మేళనం ఉన్నప్పటికీ, చాలా మంది తమ బలమైన గుజరాతీ మూలాలను నిలుపుకున్నారు.
ఇస్కాన్, హిందూ యూనియన్ ఆఫ్ మొంబాసా, హెచ్‌ఎస్‌ఎస్ (RSS) ప్రజా కార్యక్రమాలను నిర్వహించడం, ఆహార సహాయ కార్యక్రమాలు, ఇతర సేవల వంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా సమాజానికి పెద్దయెత్తున సహకారాన్ని అందిస్తున్నాయి. ఇది కెన్యన్లను పెద్ద యెత్తున ఆకట్టుకుని హిందూ సమాజం పట్ల సద్భావాన్ని కలిగించింది.
పుష్టిమార్గ్ వైష్ణవ్ సంఘ్, బ్రహ్మ కుమారీలు కూడా కెన్యాలో చురుకుగా ఉన్నారు.
నైరోబిలో ఉన్న శ్రీ స్వామినారాయణ్ మందిర్ (EASS టెంపుల్), శ్రీ స్వామినారాయణ్ ఆలయాలతో సహా కెన్యాలో 100 కు పైబడి హిందూ దేవాలయాలు ఉన్నాయి.
హిందూ కౌన్సిల్ ఆఫ్ కెన్యా అనేది కెన్యాలోని హిందువుల కోసం ఒక గొడుగు సంస్థ. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ. [9] కొన్ని సంవత్సరాల క్రితం వరకు, హిందువులను ఓటర్ల నమోదులో 'ముస్లిమేతరులు'గా అభివర్ణించేవారు. కౌన్సిల్ చేసిన కృషి కారణంగా, వారిని ఇప్పుడు 'హిందువులు'గా గుఎర్తిస్తున్నారు. కౌన్సిల్, హిందూ మత విద్య కోసం సిలబస్‌ను, పుస్తకాలనూ అందిస్తుంది. [10] హిందూ యూనియన్ ఆఫ్ మొంబాసా కెన్యాలోని పురాతన హిందూ సంస్థలలో ఒకటి. 1899లో స్థాపించిన ఈ సంస్థ, కెన్యా తీరప్రాంతంలో హిందువుల పెద్ద సమాజానికి నిలయంగా ఉంది.
హిందూ స్వయం సేవక్ సంఘ్ (HSS) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో భాగం. దీన్ని 1947లో నైరోబీలో స్థాపించారు. అప్పటి నుండి ఇది మొంబాసా, నకురు, ఎల్డోరెట్, కిసుము, మేరు వంటి వివిధ నగరాల్లో అభివృద్ధి చెందింది. ఆయా నగరాల్లో దాని కేంద్రాలున్నాయి. హిందూ ఆదర్శాలు, విలువలను సంరక్షించడం, ఆచరించడం, ప్రోత్సహించడం, హిందూ సాంస్కృతిక గుర్తింపులను నిర్వహించడం దీని ప్రధాన లక్ష్యాలు. నిరుపేదలకు ఆహారం అందించడం, అంగవైకల్యం కలిగిన వారికి చక్రాల కుర్చీలు, కృత్రిమ అవయవాలను అందించడం, ఉచిత వైద్య సేవలు, రక్తదానం వంటి అనేక మానవతా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. చెట్ల పెంపకం కార్యక్రమానికి కూడా అది ప్రసిద్ధి చెందింది.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)