డాక్టర్ కెవిపి రామచంద్ర రావు | |||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2 జూన్ 2014 – 2 జూన్ 2020 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | అంపాపురం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ | 1948 జూన్ 22||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | కోటగిరి సునీత | ||
సంతానం | ఉజ్వల్ |
కెవిపి రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు.[1]
కెవిపి రామచంద్రరావు 1948 జూన్ 22లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, అంపాపురంలో సత్యనారాయణ రావు, సీత దేవి దంపతులకు జన్మించాడు. అతను కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ నుండి ఎంబిబిఎస్ పూర్తి చేశాడు.
కెవిపి రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన 2004లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర సలహాదారుడిగా నియమితుడయ్యాడు. కెవిపి 2008లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] అతను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం 2010 నవంబరు 28 లో రాష్ట్ర సలహాదారుడి పదవికి రాజీనామా చేశాడు.అతను 2014లో తిరిగి రాజ్యసభకు ఎన్నికై 2020 ఏప్రిల్ 09 వరకు ఆ పదవిలో ఉన్నాడు.[3][4]