కే.శ్రీనివాస్ రెడ్డి | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | శ్రీనివాస్ రెడ్డి |
వృత్తి | సీనియర్ పాత్రికేయుడు |
జీవిత భాగస్వామి | కె.భారతి రెడ్డి |
పిల్లలు | 3 |
కల్మెకొలను శ్రీనివాస్ రెడ్డి (జననం 1949 సెప్టెంబరు 7) ఒక భారతీయ తెలుగు భాషా పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు. గతంలో విశాలాంధ్ర వార్తాపత్రికకు సంపాదకులుగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రజా పక్షం అనే తెలుగు దినపత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నాడు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) సభ్యుడు.
ఫిబ్రవరి 2024లో రాష్ట్రప్రభుత్వం తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా సీనియర్ పాత్రికేయుడు కె.శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. కేబినెట్ హోదా కలిగిన ఆ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతాడు.[1][2]
శ్రీనివాస్ రెడ్డి సైన్స్ డిగ్రీ పట్టాపుచ్చుకున్న ఉన్నత విద్యావంతుడు. ఆయన తన రాజకీయ విశ్లేషణల కోసం అన్ని ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్‌లలో కనిపిస్తాడు. ఆయన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు కూడా.[3]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)