![]() | |
రకం | కేంద్రీయ విశ్వవిద్యాలయం |
---|---|
స్థాపితం | 26 జనవరి 1993 |
ఛాన్సలర్ | ప్రొఫెసర్ యస్. అయ్యప్పన్ |
వైస్ ఛాన్సలర్ | ప్రొఫెసర్ ఎం. ప్రేమ్‌జిత్ సింగ్ |
స్థానం | లాంపెల్పాట్, ఇంఫాల్, మణిపూర్, భారతదేశం |
అనుబంధాలు | వ్యవసాయ పరిశోధన, విద్య విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్)(DARE), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR); యుజిసి ; ఎసియు[1] |
కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం (సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ) (Central Agricultural University) అనేది భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ లోని లాంపెల్పాట్ వద్ద వున్న ఒక వ్యవసాయ కేంద్రీయ విశ్వవిద్యాలయం.
పార్లమెంటు చట్టం, సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ చట్టం, 1992 (నం.40 ఆఫ్ 1992) ద్వారా కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించబడింది[2]. 1993 జనవరి 26న భారత ప్రభుత్వ వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగం (డీఏఆర్ ఈ) నోటిఫికేషన్ జారీ చేయడంతో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. 1993 సెప్టెంబరు 13 న ప్రారంభం అయినది. ప్రధాన కార్యాలయం మణిపూర్ లోని ఇంఫాల్ లో ఉంది. ఈ విశ్వవిద్యాలయం అధికార పరిధి లో ఉన్న ఈశాన్య ప్రాంత రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, నాగాలాండ్, త్రిపుర ఉన్నాయి[3].
భారతదేశం లోని ఇతర వ్యవసాయ విశ్వవిద్యాలయాల మాదిరిగానే, ఈ విశ్వవిద్యాలయంలో బోధన, పరిశోధన, అభివృద్ధి ఇతర అకాడమిక్ విద్య ఇంటిగ్రేటెడ్ కార్యక్రమాలను కలిగి ఉంది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో బోధన, పరిశోధన, విస్తరణ నాణ్యమైన ఉన్నత ప్రమాణ విద్యలో (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) నిలవడమే ఈ విశ్వవిద్యాలయం లక్ష్యం. వ్యవసాయం, అనుబంధ రంగాలలో ఉత్పాదకత, లాభదాయకతను మెరుగుపరచడానికి సుస్థిర వ్యవసాయ వ్యవస్థలను అభివృద్ధి చేయడంఈశాన్య భారతదేశంలో అధునాతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వ్యాప్తి చేయడానికి రైతులకు, విస్తరణ అధికారులకు శిక్షణ ఇవ్వడం విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.
వ్యవసాయం, అనుబంధ వృత్తులను లాభదాయకమైన సంస్థలుగా మార్చడానికి, ఈశాన్య ప్రాంత ప్రజలకు ఆహారం,పోషకాహార భద్రతను అందించడానికి ఈ విశ్వవిద్యాలయం ఒక ముఖ్యమైన అనుసంధానంగా పనిచేస్తుంది. పై లక్ష్యాన్ని సాధించడానికి, విశ్వవిద్యాలయం ఈశాన్య భారతదేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఏడు కళాశాలలను, మూడు కృషి విజ్ఞాన కేంద్రాలను (కెవికె) స్థాపించింది వ్యవసాయం, అనుబంధ శాస్త్రాలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్లను అందిస్తుంది[3][4].
ఈ విశ్వవిద్యాలయం లో విద్యార్థులు ప్రవేశం పొందడానికి అర్హతలలో రాష్ట్ర నామినేషన్ ద్వారా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్(ICAR), ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్(AIEEA) ద్వారా, సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీటు ద్వారాఈ విశ్వవిద్యాలయం పరిధిలోని 7 ఈశాన్య రాష్ట్రాలు (అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర) ప్రవేశం పొందే అవకాశం కల్పించారు. అభ్యర్థులు రాష్ట్ర నామినేషన్ కోసం సంబంధిత రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ సైన్స్ & పశుసంవర్ధక శాఖలను సంప్రదించవచ్చు. ఇందులో రిజర్వేషన్ అండర్ గ్రాడ్యుయేట్కోర్సులకు ఆయా రాష్ట్రాల రిజర్వేషన్ విధానం ప్రకారం మొత్తం సీట్లలో 85% స్టేట్ నామినేషన్ కింద కేటాయిస్తారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టోరల్ వాటికీ పీజీ, పీహెచ్ డీ ప్రోగ్రామ్ లకు రాష్ట్ర నామినేషన్ లేదు[5].
{{cite web}}
: Check date values in: |access-date=
(help); External link in |website=
(help)
{{cite web}}
: Missing or empty |title=
(help)