స్థాపన | 28 జూన్ 1995 |
---|---|
రకం | సాంస్కృతిక సంస్థ |
ప్రధాన కార్యాలయాలు | చిరక్కల్, కన్నూర్, కేరళ, భారతదేశం |
చైర్మన్ | ఒ.ఎస్.ఉన్నికృష్ణన్ |
సెక్రటరీ | ఎ వి అజయకుమార్ |
మాతృ సంస్థ | సాంస్కృతిక వ్యవహారాల శాఖ, కేరళ |
కేరళ ఫోక్‌లోర్ అకాడమీ (ఆంగ్లం:Kerala Folklore Academy) అనేది కేరళ రాష్ట్ర ప్రభుత్వంచే స్థాపించబడిన సాంస్కృతిక వ్యవహారాల స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇది సాంస్కృతిక వ్యవహారాల శాఖ క్రింద పనిచేస్తుంది. ఇది కేరళ సాంప్రదాయ కళారూపాలను ప్రోత్సహించడానికి, ప్రొజెక్ట్ చేయడానికి 1995 జూన్ 28న స్థాపించబడింది. ఇది కన్నూర్‌లోని చిరక్కల్‌లో ఉంది.[1] జానపద సాహిత్యంలో అధ్యయనం, పరిశోధనలను ప్రోత్సహించడానికి అకాడమీ త్రైమాసికాన్ని (Quarterly Magazine) విడుదల చేస్తుంది. కేరళ జానపద సాహిత్యంపై 25 కంటే ఎక్కువ పుస్తకాలను ప్రచురించింది. ఇది కేరళలోని 100 జానపద కళారూపాల గురించి ఒక పుస్తకాన్ని కూడా రూపొందించింది. అలాగే రెండు నిఘంటువులు కూడా ప్రచురించింది. వీటిలో ఒకటి బేరీ భాషపై, మరొకటి చవిట్టు నాటికం.[2]
ఈ సంస్థ ట్రావెన్‌కోర్ కొచ్చిన్ లిటరరీ, సైంటిఫిక్, చారిటబుల్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1955 కింద ఏర్పాటైంది. జానపద కళలలో శిక్షణ ఇవ్వడానికి, వాటి అభివృద్ధికి 1996 జనవరి 20 నుంచి కృషి చేయడం ప్రారంభించింది.[1] 2003లో రాష్ట్ర ప్రభుత్వం చిరక్కల్‌లోని చిరక్కల్ రాజుల వాటర్‌సైడ్ ప్యాలెస్‌ని వారి ప్రధాన కార్యాలయంగా ఉపయోగించుకునేందుకు అకాడమీకి అప్పగించింది.[3] అకాడమీ అధ్యయనంలో భాగంగా సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వంలో భాగమైన అనేక జానపద కళారూపాలను గుర్తించింది. ఇప్పటికే దాదాపు 1000 జానపద కళారూపాలను గుర్తించిన అకాడమీ రాబోయే తరాలకి అందించనుంది.[4]