కేశవ్ ప్రసాద్ మౌర్య | |||
![]()
| |||
ఉప ముఖ్యమంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2017 మార్చి 19 | |||
ముందు | నరైన్ సింగ్ | ||
---|---|---|---|
రాష్ట్ర మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2017 మార్చి 23 | |||
శాసనమండలి సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2017 సెప్టెంబరు 9 | |||
నియోజకవర్గం | ఉత్తరప్రదేశ్ | ||
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 2016 ఏప్రిల్ 8 – 31 ఆగష్టు 2017 | |||
తరువాత | మహేంద్రనాథ్ పాండే | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2014 మే 26 – 2017 సెప్టెంబరు 21 | |||
ముందు | కపిల్ ముని కర్వారియా | ||
తరువాత | నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ | ||
నియోజకవర్గం | ఫుల్పూర్ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2012 – 2014 | |||
ముందు | వాచస్పతి | ||
తరువాత | వాచస్పతి | ||
నియోజకవర్గం | సిరతు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] సిరతు, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1969 మే 7||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | రాజకుమార్ మౌర్య | ||
సంతానం | ఇద్దరు కుమారులు | ||
నివాసం | అలహాబాదు , ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
వృత్తి | వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు |
కేశవ్ ప్రసాద్ మౌర్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా పనిచేశాడు.
కేశవ్ ప్రసాద్ మౌర్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కౌశంబి జిల్లా, సిరాథు గ్రామంలో 1969 మే 7న జన్మించాడు. అతను బిఎ వరకు చదువుకున్నాడు.
కేశవ్ ప్రసాద్ మౌర్య ఆరెస్సెస్, బజరంగ్‌దళ్‌లో సభ్యునిగా, గో సంరక్షణ, రామజన్మభూమి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని అనంతరం భారతీయ జనతా పార్టీతో తన రాజకీయ జీవితం ప్రారంభించాడు. అతను 2002లో తొలిసారిగా బాందా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ ఓడిపోయాడు, అతననికి ఆ ఎన్నికల్లో కేవలం 204 ఓట్లు వచ్చాయి. మౌర్య 2007లో రెండోసారి అలహాబాద్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి బీఎస్పీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు.
కేశవ్ ప్రసాద్ మౌర్య 2012లో సిరాథు నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్పీ అభ్యర్థి ఆనంద్ మోహన్‌పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అతను 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఫుల్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 3 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలిచి తొలిసారి ఎంపీగా ఎన్నికై పోలయిన ఓట్లలో 52 శాతం ఓట్లు సాధించి రికార్డ్ సృష్టించాడు.
కేశవ్ ప్రసాద్ మౌర్య 2016లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడై, 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికల నాయకత్వ బాధ్యతలను పూర్తిగా తనపై వేసుకొని ఏకంగా 200 ర్యాలీలు చేపట్టి బీజేపీ పార్టీకి 312 సీట్లు రావడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఎన్నికల ఫలితాల తరువాత యూపీ సీఎం పదవి అతనికే దక్కుతుందని అందరూ భావించారు, కానీ యోగి ఆదిత్యనాథ్ తెరపైకి రావడంతో అతను కు ఉప ముఖ్యమంత్రితో పాటు పీడబ్ల్యూడీ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[2]
కేశవ్ ప్రసాద్ మౌర్య 2022 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సిరతు నియోకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అప్నా దళ్ కెమెరావాడి అభ్యర్థి డాక్టర్ పల్లవి పటేల్ చేతిలో 7337 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]