కొండాపూర్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°29′N 78°25′E / 17.483°N 78.417°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
నగరం | రంగారెడ్డి జిల్లా |
మెట్రో | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500084[1] |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | చేవెళ్ళ |
శాసనసభ నియోజకవర్గం | శేరిలింగంపల్లి |
పట్టణ అభివృద్ధి సంస్థ | హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ |
సివిక్ ఏజెన్సీ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
కొండాపూర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు పశ్చిమ భాగంలోని ఒక శివారు ప్రాంతం.[2] ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోకి వస్తుంది. హైదరాబాదు ఐటీ కారిడార్‌కి దగ్గరగా ఉన్నందున ఇది అనేక వాణిజ్య, నివాస కేంద్రంగా పరిణామం చెందింది.[3] హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని 104వ వార్డు నంబరులో ఉంది.[4]
2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[5]
కొండాపూర్ అనేది కొండ (గుట్ట), పూర్ (పురము) రెండు తెలుగు పదాల కలయిక. కొండ మీద ఉన్న ప్రాంతం అని అర్థం.
ప్రశాంత్ నగర్ కాలనీ, పోలీస్ కాలనీ రోడ్, రాజరాజేశ్వర నగర్, జెవి హిల్స్, పోలీస్ కాలనీ, బిక్షపతి నగర్, రాఘవేంద్ర కాలనీ, అటవీ శాఖ కాలనీ, జయభేరి ఎన్‌క్లేవ్ మొదలైన ఉపప్రాంతాలు ఉన్నాయి.
సైబరాబాదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జోన్‌లో ఈ కొండాపూర్ ప్రాంతం ఉంది. గత దశాబ్దకాలంగా ఈ ప్రాంతం వేగంగా ఆధునిక వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. గూగుల్ సంస్థకు చెందిన హైదరాబాద్ విభాగం ఈ కొండాపూర్‌లోనే ఉంది.[6] గత రెండు దశాబ్దాలలో (1996 - 2010) ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, వాణిజ్య జోన్ విస్తరణ అధికంగా ఉంది.
ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కిమ్స్, అపోలో వంటి ఆసుపత్రులు, రత్నదీప్, హెరిటేజ్ ఫ్రెష్ మొదలైన అనేక సూపర్‌మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి.[7] ఇక్కడికి సమీపంలోని గచ్చిబౌలి స్పోర్ట్ అరేనాలో క్రీడా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. సమీపంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో వివాహాలు, సెమినార్‌ల కోసం మంచి వేదికలు ఉన్నాయి.
రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ అవుట్‌లెట్‌లు, అన్ని ప్రధాన బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. టొయోటా, మహీంద్రా, హ్యుందాయ్, హోండా, మారుతి సుజీకి వంటి ఆటోమొబైల్స్ ప్రధాన షోరూమ్‌లు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడినుండి వివిధ ప్రాంతాలకు బస్సు సౌకర్యం (127కె - కొండాపూర్ నుండి కోఠివరకు, 10హెచ్ - కొండాపూర్ నుండి సికింద్రాబాద్ వరకు, 47కె - సికింద్రాబాద్ నుండి కొండాపూర్ వరకు, 222 - పటాన్ చెరు నుండి కొండాపూర్ మీదుగా కోటి వరకు) ఉంది. ఇక్కడికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా బస్సు (ఎయిర్‌పోర్ట్ సర్వీస్), టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. హఫీజ్‌పేట్ రైల్వే స్టేషను నుండి హైదరాబాద్ ఎంఎంటిఎస్ సేవలు, హైటెక్ సిటీ మెట్రో స్టేషను నుండి హైదరాబాద్ మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి.
సాంస్కృతిక కేంద్రం శిల్పారామం 2 కి.మీ.ల దూరంలో, కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్/రిజర్వ్ ఫారెస్ట్ ఉంది.[8]