కొందుర్గు మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, కొందుర్గు మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°05′57″N 78°02′13″E / 17.0992°N 78.0369°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | కొందుర్గ్ (పశ్చిమ) |
గ్రామాలు | 36 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 60,518 |
- పురుషులు | 30,534 |
- స్త్రీలు | 29,984 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 41.86% |
- పురుషులు | 54.57% |
- స్త్రీలు | 28.92% |
పిన్కోడ్ | 509207 |
కొందుర్గు మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1] కొందుర్గ్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 40 కి. మీ. దూరంలో, 7 వ నెంబరు జాతీయ రహదారి 7 మీద షాద్ నగర్ నుండి పరిగి వెళ్ళు మార్గంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం షాద్నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
2011 జనాభా లెక్కల ప్రకారం 60550. ఇందులో పురుషుల సంఖ్య 30685, స్త్రీల సంఖ్య 29865. అక్షరాస్యుల సంఖ్య 27702.[3] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 130 చ.కి.మీ. కాగా, జనాభా 28,856. జనాభాలో పురుషులు 14,579 కాగా, స్త్రీల సంఖ్య 14,277. మండలంలో 6,653 గృహాలున్నాయి.[4]