కొడైకెనాల్ సరస్సు, కొడైకెనాల్ పట్టణంలోని మానవ నిర్మితమైన, అతి ప్రసిద్ధమైన సరస్సు. తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలో ఉంది ఈ పట్టణం. ఈ సరస్సును 1863 లో అప్పటి మదురై కలెక్టర్ సర్ వెరే హెన్రీ లెవింగ్ నిర్మించాడు.[1] ఈ పట్టణాన్ని కూడా బ్రిటీష్ అధికారులు, మిషనరీలు ఎక్కువగా అభివృద్ధి చేశారు.[2][3] కొడైకెనాల్ హిల్ స్టేషన్‌లో ముఖ్యమైన పర్యాటక ప్రదేశం ఇదే.
ఇక్కడ ఒక బోట్ క్లబ్బు, పడవ విహార సేవలూ సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. వేసవిలో పడవ ప్రదర్శనలు, పూల ప్రదర్శనలూ ఇక్కడ సాధారణం.[4]
తిరునల్వేలి నుండి కోడై రోడ్డు రైల్వే స్టేషనుకు రైలుద్వారా చేరుకోవచ్చు. అక్కడి నుండి 80 కి.మీ. రోడ్డు దారిలో కొడైకెనాల్ చేరుకోవచ్చు. లేదా 18 కి.మీ. కాలి నడక దారిలోనైనా చేరుకోవచ్చు. పళని రైల్వే స్టేషను నుండి కొడైకెనాల్ 64 కి.మీ. మదురై నుండి 121 కి.మీ., కోయింబత్తూరు నుండి 135 కి, మీ. ఉంటుంది. తమిళనాడు లోని వివిధ ప్రాంతాల నుండి బస్సు సర్వీసులు కూడా ఉన్నాయి.[5]
ఈ సరస్సు నక్షత్రం ఆకారంలో, కొడైకెనాల్ పట్టణానికి నడిమధ్యన ఉంది. చుట్టూ పచ్చని పళని కొండలతో రమణీయంగా ఉంటుంది. సరస్సుకు ప్రధాన నీటి వనరు ఈ కొండలే.[6]
మూడు వాగులు ప్రవహించే చోట ఒక మట్టి కట్ట కట్టి సరస్సును నిర్మించారు. సరస్సు పరీవాహక ప్రాంతంలో 1650 మి.మీ. వార్షిక వర్షపాతం ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 19.8 °C (గరిష్ఠ) and 11.3 °C (కనిష్ఠ) గాను, శీతాకాలంలో 17.3 °C (గరిష్ఠ) and 8.3 °C (కనిష్ఠ) గానూ ఉంటాయి. [6] ఈ సరస్సు నుండి బయటికి ప్రవహించే నీటి ప్రవాహంతో 8 కి.మీ. దూరాన సిల్వర్ కాస్కేడ్ అనే జలపాతం ఏర్పడింది. దీని ఎతు 180 అడుగులు ఉంటుంది.[6]
సరస్సు లోని నీటి నాణ్యతను పరీక్షించినపుడు [7] కింది విషయాలను గమనించారు:
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)