![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నాగేంద్రబాబు | |
---|---|
![]() | |
జననం | నాగేంద్రబాబు కొణిదల 29 అక్టోబరు 1961 |
జాతీయత | ఇండియన్ |
ఇతర పేర్లు | నాగబాబు |
వృత్తి | నటుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1988 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | పద్మజ కొణిదల |
పిల్లలు | వరుణ్ తేజ్ (కుమారుడు) నీహారిక కొణిదెల (కుమార్తె) |
తల్లిదండ్రులు | వెంకట్రావ్ కొణిదల అంజనాదేవి కొణిదల |
బంధువులు | చిరంజీవి (అన్నయ్య) పవన్ కళ్యాణ్ (తమ్ముడు) రేణు దేశాయ్ (పవన్ కళ్యాణ్ భార్య) రాంచరణ్ (అన్న కొడుకు) అల్లు రామలింగయ్య (చిరంజీవి మామ) అల్లు అరవింద్ (చిరంజీవి బావమరిది) అల్లు అర్జున్ (brother's nephew) అల్లు శిరీష్ (brother's nephew) |
కొణిదల నాగేంద్రబాబు (జననం 1961 అక్టోబర్ 29) తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు, నిర్మాత. ఆయన చాలా సినిమాల్లో సహాయ నటుడిగానూ, కొన్ని సినిమాల్లో హీరోగాను నటించారు. అంతే కాకుండా ఆయన అంజనా ప్రొడక్షన్స్ అనే చిత్ర పరిశ్రమ సంస్థకు అధినేత.
అక్టోబర్ 29, 1961న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ద్వితీయ సంతానంగా నాగేంద్రబాబు జన్మించాడు. నాగేంద్రబాబు సోదరులు చిరంజీవి (సినిమా నటుడు), పవన్ కళ్యాణ్ (సినిమా నటుడు).
నాగేంద్రబాబు తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరి 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడిగా పోటీచేశాడు.[4] ఎన్నికల ఫలితాలలో వై. ఎస్. ఆర్. సి. పి అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణ రాజు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వి. వి. శివరామరాజు తర్వాత మూడో స్థానంలో నిలిచాడు. నాగబాబుకు 21.31% ఓట్లు లభించాయి.[5]