కొత్త రఘురామయ్య | |||
కొత్త రఘురామయ్య కొత్త రఘురామయ్య | |||
పార్లమెంటు సభ్యుడు మాజీ కేంద్ర మంత్రి
| |||
పదవీ కాలం 1,2,3,4,5,,6 లోక్ సభలలో(1952-1979) సభ్యులు | |||
నియోజకవర్గం | తెనాలి, గుంటూరు | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఆగష్టు 6, 1912 గుంటూరు మండలానికి చెందిన సంగం జాగర్లమూడి | ||
మరణం | జూన్ 6, 1979 | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | లక్షీ రఘురామయ్య | ||
మతం | హిందూమతము |
కొత్త రఘురామయ్య (ఆంగ్లం: Kotha Raghuramaiah) (ఆగష్టు 6, 1912 - జూన్ 6, 1979). లోక్ సభ సభ్యుడుగా 1952 నుండి 1979 వరకు పనిచేసారు.రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోక్‌సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించి పేరు సంపాదించాడు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు.[1]
1912, ఆగష్టు 6న ఆంధ్ర దేశములోని గుంటూరు మండలానికి చెందిన సంగం జాగర్లమూడి గ్రామంలో జగన్నాధం, కోటమ్మ అను దంపతులకు జన్మించాడు. జగన్నాధం చుట్టుపక్క గ్రామాలలో పేరుగాంచిన భూస్వామి, మహాదాత.
స్వగ్రామంలో, గుంటూరులో ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల. లక్నో విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసము చేసారు. తదుపరి రఘురామయ్య ఇంగ్లాండు లోని మిడిల్ టెంపుల్ వెళ్ళి 'బార్-ఎట్-లా' చదివాడు. స్వదేశము తిరిగి వచ్చి 1937 నుండి 1941 వరకు మద్రాసు హైకోర్టులో వకీలుగా పనిచేశాడు. ఆ తరువాత బ్రిటీషు ప్రభుత్వములోని న్యాయశాఖలో ఉద్యోగమునకు కుదురుకున్నాడు. భారత ప్రభుత్వ న్యాయ శాఖలో డిప్యుటీ సెక్రటరి గా పనిచేసారు.
1937 లో లక్షీ రఘురామయ్య తో వీరి వివాహం జరిగింది.
1949లో ప్రభుత్వ ఉద్యోగము వదలి జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయరంగ ప్రవేశము చేశాడు.రెండు దశాబ్దాలుపాటు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో కీలక పాత్ర వహించిన వ్యక్తి
తొలి లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా తెనాలి నుండి (1952-57) ఏన్నికైనారు.
రెండవ లోక్ సభ (1957-62) ఏన్నికలలో గుంటూరు లోక్ సభాస్థానం నుండి ఏన్నికైనారు, ఆ తరువాత వరుసగా 3వ లోక్ సభ (1962-67), 4వ లోక్ సభ (1967-72), 5వలోక్ సభ (1972-77), 6వ లోక్‌సభ (1977-1980) లలో గుంటూరు నియోజకవర్గం నుండి నాయకత్వము వహించి పలు సేవలందించాడు[2].
జవహర్ లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలో 1957లో రక్షణ శాఖ సహాయ మంత్రిగా చేరి 1964 వరకు రక్షణ, కార్మిక, పౌర సరఫరాలు మంత్రిగా పనిచేసారు. లాల్ బహుదుర్ శాస్త్రి గారి మంత్రివర్గంలో(1964-66)వరకు పౌర సరఫరాలు, సాంకేతిక శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించి పేరు సంపాదించాడు[3].ఇందిరా గాంధీ గారి మంత్రివర్గంలో(1966- 77) వరకు న్యాయ, పెట్రొలియం, పార్లమెంటరి వ్యవహారాలు, నౌకా రవాణా,పర్యాటక శాఖామాత్యులుగా సుదీర్ఘ కాలం పనిచేసారు.
కొత్త రఘురామయ్య గారు జూన్ 6, 1979లో పరమపదించాడు.
వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 1975లో గౌరవ డాక్టరేట్ 'కళాప్రపూర్ణ ' పురస్కారం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 1977లో గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి గౌరవించాయి.
ఆయన పేరు మీద నరసరావుపేట, దుగ్గిరాలలో రెండు కళాశాలలు నెలకున్నాయి.