కొత్తూరు (రంగారెడ్డి జిల్లా)

కొత్తూరు (CT)
—  రెవిన్యూ గ్రామం  —
కొత్తూరు (CT) is located in తెలంగాణ
కొత్తూరు (CT)
కొత్తూరు (CT)
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°08′41″N 78°17′19″E / 17.144727°N 78.288574°E / 17.144727; 78.288574
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం కొత్తూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 65,199
 - పురుషుల సంఖ్య 33,957
 - స్త్రీల సంఖ్య 31,242
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
కొత్తూరు పురపాలక సంఘ కార్యాలయం

కొత్తూరు, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలానికి చెందిన జనగణన పట్టణం.[1] ఇది కొత్తూరు పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]

ఇది హైదరాబాదుకు సమీపంలో ఉంది. పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందినది. షాద్‌నగర్, హైదరాబాదు మధ్యలో ఈ గ్రామం ఉంది. ఇక్కడికి రైలు సౌకర్యం కూడా ఉంది. సికింద్రాబాదు రైల్వే స్టేషను నుంచి 50 కిలోమీటర్ల దూరాన ఉంది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]

మహబూబ్ నగర్ జిల్లా నుండి రంగారెడ్డి జిల్లాకు మార్పు.

[మార్చు]

లోగడ కొత్తూరు పట్టణం / మండలం మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్,రెవెన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తూరు మండలాన్ని (1+10) పదకొండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన రంగారెడ్డి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

గణాంకాలు

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా మొత్తం 12,740. ఇందులో పురుషుల సంఖ్య 6396, స్త్రీల సంఖ్య 6354. అక్షరాస్యుల 74.26 %.గా ఉంది..[5]

నీటిపారుదల, భూమి వినియోగం

[మార్చు]

మండలంలో 6 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 378 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[6]

మూలాలు

[మార్చు]
  1. https://www.census2011.co.in/data/town/574216-kothapet-andhra-pradesh.html
  2. నమస్తే తెలంగాణ, తెలంగాణ (3 May 2021). "జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, న‌కిరేక‌ల్, అచ్చంపేట‌ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ప్ర‌భంజ‌నం". Namasthe Telangana. Archived from the original on 3 May 2021. Retrieved 3 May 2021.
  3. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  5. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126
  6. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 80

వెలుపలి లింకులు

[మార్చు]