కొరియర్ బాయ్ కళ్యాణ్ | |
---|---|
![]() కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | ప్రేమ్‌సాయి |
రచన | ప్రేమ్‌సాయి |
నిర్మాత | గౌతమ్ మీనన్, వెంకట్ సోమసుందరం, రేష్మ ఘటల, సునీత తాటి |
తారాగణం | నితిన్, యామీ గౌతం |
ఛాయాగ్రహణం | సత్యా పోన్మార్ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | కార్తీక్, అనూప్ రూబెన్స్, సందీప్ చౌతా (నేపథ్య సంగీతం) |
నిర్మాణ సంస్థ | ఫోటాన్ కథాస్ |
విడుదల తేదీ | 17 సెప్టెంబరు 2015 |
సినిమా నిడివి | 104 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కొరియర్ బాయ్ కళ్యాణ్ 2015, సెప్టెంబరు 17న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రేమ్‌సాయి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, యామీ గౌతం నటించగా కార్తీక్, అనూప్ రూబెన్స్, సందీప్ చౌతా సంగీతం అందించారు.[1][2] ఈ చిత్రాన్ని ఫోటాన్ కథాస్, గురు ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో గౌతమ్ మీనన్ నిర్మించాడు.[3] జై హీరోగా తమిళసెల్వనం తనియార్ అంజలం పేరుతో తమిళ భాషలో తెలుగుతోపాటే చిత్రీకరణ జరుపుకుంది. కొరియర్ బాయ్ కళ్యాణ్ పేరుతోనే హిందీలోకి అనువాదమయింది.
డిగ్రీ ఫెయిలై ఉద్యోగంకోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ (నితిన్) కావ్య (యామి గౌతమ్)ను చూసి ప్రేమించి, తన కోసమే కొరియర్ బాయ్ గా పనిచేస్తుంటాడు. విదేశాల్లో పేరుగాంచిన డాక్టర్ అశుతోష్ రానా అధిక డబ్బు కోసం ఓ పరిశోధన చేస్తూ, దానికోసం ఇక్కడి డాక్టర్ల సహాయం తీసుకుంటాడు. డెలివరీ కోసం తమ, తమ హస్పిటల్స్ కు వచ్చిన గర్భవతులను వారికి తెలియకుండానే అబార్షన్ చేసి వారిలోని స్టెమ్ సెల్స్ ను సేకరించి అశుతోష్ రానా కు పంపుతుంటారు ఇక్కడి డాక్టర్లు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక ఆసుపత్రిలో పనిచేసే వార్డుబాయ్ హైద్రాబాద్‌లో ఉండే సామాజిక కార్యకర్త అయిన సత్యమూర్తి (నాజర్)కు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక కొరియర్ చేస్తాడు. అదే కొరియర్ ..కొరియర్ బాయ్ గా పనిచేస్తున్న నితిన్ చేతిలో పడుతుంది. చివరకు కళ్యాణ్ ఆ కొరియర్ ను సత్యమూర్తికి ఎలా చేర్చాడు అనేది మిగతా సినిమా.
2015, సెప్టెంబరు 11న విడుదలచేస్తామని నిర్మాతలు ప్రకటించారు.[4] 2015, సెప్టెంబరు 17న విడుదల అయింది.[5]
కార్తీక్, అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు, సోని మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యాయి.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "మాయ ఓ మాయ (రచన: శ్రేష్ట)" | కార్తీక్ | 4:20 | ||||||
2. | "బంగారమ్మ (రచన: అనంత శ్రీరామ్, శ్రీచరణ్ కస్తూరిరంగన్)" | శ్రీచరణ్ కస్తూరిరంగన్, కార్తీక్, మేఘ | 3:58 | ||||||
3. | "మందు మందు (రచన: సాహితి)" | కార్తీక్, బాబా సెహగల్ | 3:14 | ||||||
4. | "వాటు కళ్ళ పిల్ల (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | అనూప్ రూబెన్స్, సుచిత్ర | 3:30 | ||||||
15:02 |