కొల్లి శ్రీనాథ్ రెడ్డి[1] | |
---|---|
![]() | |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | వైద్యుడు |
వీటికి ప్రసిద్ధి | ప్రజారోగ్యం |
ఆచార్య కొల్లి శ్రీనాథ్ రెడ్డి, భారతీయ హృద్రోగ నిపుణుడు. భారత ప్రజారోగ్య సమాఖ్య అధ్యక్షుడు, వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ యొక్క అధ్యక్షుడు. వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షస్థానాన్ని వహించిన తొలి భారతీయుడు.[2] పద్మభూషణ పురస్కార గ్రహీత. ఇతని తండ్రి కె.వి.రఘునాథరెడ్డి కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తి. శ్రీనాథ్ రెడ్డి పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అతని వ్యక్తిగత వైద్యుడిగా పనిచేశాడు.