కొల్లిపర

కొల్లిపర
కొల్లిపర లాకులు (నీటి కాలువపై వంతెన)
కొల్లిపర లాకులు (నీటి కాలువపై వంతెన)
పటం
కొల్లిపర is located in ఆంధ్రప్రదేశ్
కొల్లిపర
కొల్లిపర
అక్షాంశ రేఖాంశాలు: 16°17′15.85″N 80°45′6.94″E / 16.2877361°N 80.7519278°E / 16.2877361; 80.7519278
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు
మండలంకొల్లిపర
విస్తీర్ణం17.43 కి.మీ2 (6.73 చ. మై)
జనాభా
 (2011)
12,982
 • జనసాంద్రత740/కి.మీ2 (1,900/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు6,283
 • స్త్రీలు6,699
 • లింగ నిష్పత్తి1,066
 • నివాసాలు4,210
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522304
2011 జనగణన కోడ్590281

కొల్లిపర గుంటూరు జిల్లాలోని మండల కేంద్రము. ఇది సమీప పట్టణమైన తెనాలి నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4210 ఇళ్లతో, 12982 జనాభాతో 1743 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6283, ఆడవారి సంఖ్య 6699. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3502 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 295. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590281[2].కృష్ణానదీ తీరాన, పచ్చని పంట పొలాలతో, కాలువలతో, ప్రశాంతమైన వాతావరణంతో విలసిల్లుతూ ఉంటుంది.

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12,780. ఇందులో పురుషుల సంఖ్య 6,326, స్త్రీల సంఖ్య 6,454, గ్రామంలో నివాస గృహాలు 3,571 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,743 హెక్టారులు.

గ్రామ విశేషాలు

[మార్చు]
  • కొల్లిపర గ్రామంలోని ఒక నిరుపేద కుటుంబానికి చెందిన చావలి సునీల్ కు చిన్నప్పటి నుండి క్రీడలనిన చాలా మక్కువ. ఇతడు త్రోబాల్ క్రీడలో అత్యుత్తమ శిక్షణపొంది, దానిలో రాణించుచూ, జాతీయస్థాయిలో పలు పతకాలు సాధించాడు. ఇతడు తొలిసారిగా మలేషియా దేశంలో, అంతర్జాతీయ స్థాయిలో, భారతదేశం, మలేషియా, శ్రీలంక దేశాల మధ్య జరిగిన ముక్కోణపు పోటీలలో భారత జట్టుకు టీం కెప్టెనుగా నిలిచి, విజేతగా బంగారు పతకం సాధించాడు. ఆ తరువాత 2014, జూన్-21 నుండి 23 వరకు జరిగిన ఐదవ ఆసియా త్రోబాల్ ఛాంపియన్ షిప్పు పోటీలలో, భారత జట్టుకు వైస్ కెప్టెనుగా, తన క్రీడా ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. భారతదేశంతోపాటు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు పాల్గొన్న ఈ పోటీలలో అన్ని మ్యాచిలలోనూ జట్టును గెలిపించి, మలేషియా ప్రభుత్వం నుండి బంగారు పతకం మరియూ ఙాపిక అందుకున్నాడు.
  • ఈ గ్రామానికి చెందిన పుడిపిరి పద్మావతి మగవాడైనా గానీ, ఆడపిల్లలు లేని లోటు తీర్చుకొనేటందుకు, వీరితల్లిదండ్రులు, తన ఐదవ కుమారుడైన ఈయనకు, చిన్నతనంలోనే "పద్మావతి" అని ఆడపిల్ల పేరుపెట్టినారు. ఈయన సమాజసేవ చేయుచూ తన పేరును "నిజం"గా మార్చుకున్నారు. వీరు మానవసేవే మాధవసేవ అని భావించి, 16 సంవత్సరాలుగా సమాజసేవే లక్ష్యంగా రిక్షా తొక్కుతూ దేశయాత్ర చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో సమాజసేవకు ముందుకొచ్చారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వృద్ధులు, అంధులు, వికలాంగులను తన రిక్షాలో గమ్యస్థానం చేరుస్తుంటారు. దేశయాత్రలో ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో నాలుగైదు రోజులు అక్కడే ఉంటూ సమాజసేవకు ఉపక్రమిస్తుంటారు. కడుపు నిండకపోయినా, సాటివారికి సాయపడాలన్నదే ఆయన లక్ష్యం. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా 2,3 రోజులు భోజనం చేయకుండా పస్తులుంటారు. మద్యం, సిగరెట్టు త్రాగేవారిని తన రిక్షా తాకవద్దంటూ బోర్డు ఏర్పాటుచేసారు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళినపుడు భాషా సమస్య ఎదురుకాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషలలో గూడా మాట్లాడటం నేర్చుకున్నారు.

సమీప గ్రామాలు

[మార్చు]

మున్నంగి 4 కి.మీ, తూములూరు 4 కి.మీ, చివలూరు 5 కి.మీ, దంతులూరు 6 కి.మీ, హనుమాన్ పాలెం 6 కి.మీ..

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. గ్రామంలో ఒక ప్రభుత్వ మేనేజిమెంటు కళాశాల ఉంది. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.

  • అవుతు రామిరెడ్డి జూనియర్ కళాశాల:- ఈ కలాశాల 36వ వార్షికోత్సవం, 2017, ఫిబ్రవరి-20న ఘనంగా నిర్వహించారు.
  • ఎస్.సి.బాలికల వసతి గృహం.
  • ప్రాథమిక పాఠశాల (ఆర్).
  • ఉర్దూ పాఠశాల.

సమీప ఇంజనీరింగ్ కళాశాల చింతలపూడిలో ఉంది. సమీప వైద్య కళాశాల, పాలీటెక్నిక్ గుంటూరులో ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

కొల్లిపరలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, 9 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో10 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు 8 మంది, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

బావుల నీరు గ్రామంలో అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

కొల్లిపరలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

కొల్లిపర గ్రామములోని కరకట్ట ప్రక్కన, ప్రయాణీకుల సౌకర్యార్ధం, పది లక్షల రూపాయల వ్యయంతో, నిర్మించిన ఒక బస్ షెల్టర్‌ను 2020, అక్టోబరు-18న నిర్మించారు. దీనిని గ్రామానికి చెందిన శ్రీ తియ్యగూర శ్రీరామిరెడ్డి (చిట్టి), తన భార్య బుల్లెమ్మ జ్ఞాపకార్ధం, నిర్మించి విరాళంగా అందజేసినారు.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

బ్యాంకులు

[మార్చు]

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

కొల్లిపరలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 160 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 6 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1577 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 50 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1527 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

కొల్లిపరలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1016 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 511 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

కొల్లిపరలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, పసుపు, మొక్కజొన్న

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో పి. సుదర్శనకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ గంగా బాల త్రిపుర సుందరీ సమేత శ్రీ లక్ష్మణేశ్వర స్వామి ఆలయo

[మార్చు]

ఈ గ్రామంలో రు. 1.5 కోట్ల నిధులతో చేపట్టిన శ్రీ గంగా బాల త్రిపుర సుందరీ సమేత శ్రీ లక్ష్మణేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరుగుచున్నది. ఈ ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠామహోత్సవాన్ని పురస్కరించుకొని, జూన్-8, ఆదివారం నాడు ప్రత్యేకపూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

శ్రీదేవీ భూదేవీ సమేత జనార్ధనస్వామి ఆలయం

[మార్చు]

ఇక్కడ వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక కార్యక్రమాలు జరుగును. ఈ ఆలయంలో 2014, జూన్-7 శనివారం నాడు స్వామివారి శాంతికళ్యాణం నిర్వహించెదరు. ఆలయంలో స్వామివారిని పునహఃప్రతిష్ఠించి 5 సంవత్సరాలు అయిన సందర్భంగా, సూర్యోదయం నుండియే ప్రత్యేక పూజాదికాలు ప్రారంభించెదరు.

25.5 లక్షల రూపాయల ప్రాథమిక అంచనా వ్యయంతో, ఈ ఆలయ రాజగోపుర నిర్మాణం చురుకుగా సాగుచున్నది. ముఖద్వారానికి ఏర్పాటుచేసిన శిలా తోరణాలను కోటప్పకొండ సమీపంలోని పురుషోత్తమపట్నం నుండి తీసికొని వచ్చారు. ఈ శిలలపై కళాకారులతో నగిషీలు చెక్కించారు. రాజగోపుర నిర్మాణం 8/2017 కి పూర్తి కాగలదు.

శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్యస్వామి వార్ల ఆలయం

[మార్చు]

కొల్లిపర గ్రామంలో కృష్ణా నది పరీవాహక ప్రాంతములో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్యస్వామి వార్ల తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, ఫాల్గుణమాసంలో పౌర్ణమిరోజున వైభవంగా నిర్వహించెదరు. సూర్యోదయానికే భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చి, పొంగళ్ళు, పసుపు కుంకుమలు, పట్టువస్త్రాలు సమర్పించుకుంటారు. తిరునాళ్ళను పురస్కరించుకొని, వీధులలో సందడి వాతావరణం నెలకొంటుంది. " వింతా " వారి కుటుంబం నుండి తిరుపతమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించటం ఇక్కడి ఆనవాయితీ. గ్రామ (ప్రభ) బండి ఏర్పాటు చేసి, పసుపు, కుంకుమలతో కుటుంబసభ్యులు ఆలయానికి తరలివచ్చెదరు. [5]

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయానికి మాన్యం భూములు, మెట్ట-16 సెంట్లు, ఆర్ధనూరివారి ధర్మ తోపు మాగాణి-8.66 ఎ., చేపలచెరువు-2 ఎ., దావులూరి అడ్డరోడ్డు లోని విశ్వబ్రాహ్మణచెరువు భూమి-3.93 ఎ.

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో 49 రోజులనుండి నిర్వహించుచున్న హనుమాన్ చాలీసా పారాయణం ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకొని, ఆఖరిరోజైన 2015, జూన్-13వ తేదీ శనివారంనాడు, స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సువర్చలా సమేత శ్రీ ఆంజనేయస్వామివారి కళ్యాణాన్ని, కన్నులపండువగా నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ వేడుకలలో పాల్గొన్నారు.

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం

[మార్చు]

కొల్లిపర గ్రామములో, కృష్ణానది కరకట్టపై నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రప్రతిష్ఠా మహోత్సవాలు, 2017, జూన్-3వతేదీ శనివారంనాడు ప్రారంభమైనవి. 5వతేదీ సోమవారంనాడు, మూలమంత్ర మహాహోమం, యంత్రస్థాపన, స్వామివారి విగ్రహప్రతిష్ఠ, విమాన శిఖరస్థాపన, స్వామివారి కళావాహన మొదలగు పూజాకార్యక్రమాలు నిర్వహించారు. శనివారం నుండి సోమవారం వరకూ, ఈ మూడురోజులూ, ఆలయంలో హనుమాన్‌చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. 5వతేదీసోమవారం ఉదయం 8-47 కి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. అనంతరం కన్నులపండువగా నిర్వహించిన శ్రీ సీతారామస్వామివారి శాంతికళ్యాణంలో, పలువురు దంపతులు పాల్గొని, భక్తిశ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి సంకీర్తనలతో భజనబృందాలు తమవంతు సేవలను అందించారు. హనుమాన్‌చాలీసా పారాయణంలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  • అవుతు రామిరెడ్డి] మాజీ శాసనసభ సభ్యులు
  • కూసం రాజశేఖరర మాజీ శాసనసభ సభ్యులు
  • గుదిబండి వెంకటరెడ్డి మాజీ శాసనసభ్యులు
  • నాదెండ్ల మనోహర్ మాజీ శాసనసభ్యులు స్పీకర్ తెనాలి నియోజక వర్గం
  • ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శాసనసభ సభ్యులు తెనాలి నియోజక వర్గం
  • చావలి రామచంద్రరావు బాల సాహితీ వేత్త, గ్రంథాలయ నిర్మాత, ప్రజా ఉద్యమకారుడు

మూలాలు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు

[మార్చు]