ఆరోహణ | S R₁ G₂ M₁ P D₂ N₃ Ṡ |
---|---|
అవరోహణ | Ṡ N₃ D₂ P M₁ G₂ R₁ S |
కోకిలప్రియ రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది 72 మేళకర్త రాగాల జాబితాలో 11వ మేళకర్త రాగము.[1] ఇది ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో 11వ రాగం. దీణిని "కోకిలరవం" అని పిలుస్తారు[2][3].
ఇది రెండవ చక్ర నేత్రలో ఐదవ రాగం. దీని ధారణానుకూలమైన పేరు "నేత్ర-మ". దీణి ధారణానుకూలమైన స్వర వాక్యం స రి గ మ ప ధ న. [4]
ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R1 G2 M1 P D2 N3 S)
అవరోహణ :స ని ధ ప మ గ రి స
(S N3 D2 P M1 G2 R1 S)
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం,చతుశ్రుతి దైవతం,కాకలి నిషాదం . ఇది 47 మేళకర్త సువర్ణాంగి రాగానికి శుద్ధ మధ్యమ సమానము.
చాలామంది వాగ్గేయకారులు కోకిలప్రియ రాగంలో కీర్తనల్ని రచించారు.
ముత్తుస్వామి దీక్షితులు కోకిలరవం రాగంలో "కోదండరామ" అనే స్వరాన్ని కూర్చాడు.
కోకిలప్రియ రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి.