కోకిలమ్మ

కోకిలమ్మ
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాలచందర్
తారాగణం సరిత,
స్వప్న
రాజీవ్
సంగీతం ఎమ్మెస్ విశ్వనాధన్
నిర్మాణ సంస్థ లక్ష్మీ జ్యోతి ఫిల్మ్స్
భాష తెలుగు

కోకిలమ్మ 1983 లో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం. కోకిలమ్మ టైటిల్ రోల్ ను సరిత పోషించింది. ఆచార్య ఆత్రేయ రాసిన పాటలు, ఎంఎస్ విశ్వనాథన్ అందించిన సంగీతంతో ఇది మ్యూజికల్ హిట్ చిత్రం.

స్త్రీ ఆత్మవిశ్వాసాన్ని చాటే చిత్రంగా దీన్ని భావిస్తారు.[1]

వినికిడి శక్తిలేని కోకిలమ్మ ఒక పనిమనిషి. తనకున్నదాంట్లో పదిమందికి సహాయం చేయాలనుకునే అనాథ. ఆమె ఉంటున్న దిగువ మధ్యతరగతి వాడలోకి గాయకుడవ్వాలనుకునే కుర్రాడు అద్దెకు వస్తాడు. తనకు వినిపించకపోయినా అతని కంఠంలోని హెచ్చుతగ్గుల కదలికల స్పర్శతో అతని పాటకు విమర్శకురా లవుతుంది. అతడికి ఆర్థికంగా సాయపడుతుంది. ఆమె చెప్పినట్టే అతను మంచి గాయకుడవుతాడు. పేరు, డబ్బు వస్తుంది. ఆమెను మర్చిపోతాడు. ఆ వాడ వదిలి కలవారింటి అల్లుడవుతాడు. కోకిలమ్మ మనసు గాయపడినా, కన్నీళ్లు రానివ్వకుండా ఆ దుఃఖాన్ని ఇంగేస్తుంది. [1]

పాటలు

[మార్చు]
ట్రాక్ సంఖ్య ట్రాక్ శీర్షిక గీత రచయిత సింగర్ (లు)
1 ఎవ్వరో పాడారు భూపాల రాగం, సుప్రభాతమై ఆచార్య ఆత్రేయ ఎస్పీ బాలసుబ్రమణ్యం
2 కొమ్మ మీద కోకిలమ్మ కుహు అన్నదీ పి. సుశీలా
3 నీలో వలపుల సుగంధం - నాలో చిలికెను మకరందం ఎస్పీ బాలసుబ్రమణ్యం, పి.సుశీల
4 పల్లవించవా నా గొంతులో - పల్లవి కావా నా పాటలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
5 మధురం మధురం నాదం పిబి శ్రీనివాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
6. లక్ష్మీ క్షీర సముద్ర ఎస్. పి బాలసుబ్రహ్మణ్యం

7.పోనీ పోతే పోనీ మనసు మారిపోని మమత , గానం . పి. సుశీల

8.స్వర రాగాలాపన , గానం.ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

పురస్కారాలు

[మార్చు]

1982 లో కోకిలమ్మ చిత్రం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కె. బాలచందర్కు ఉత్తమ చిత్రానువాదం రచయితగా నంది అవార్డును ప్రదానం చేసింది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "ఆత్మవిశ్వాసమే ఆయుధం". Sakshi. 2019-10-07. Retrieved 2020-08-31.

2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.