కోఠి | |
---|---|
![]() మహాత్మా గాంధీ బస్ స్టేషను | |
దేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ జిల్లా |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 095 |
Vehicle registration | టిస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | గోషామహల్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
కోఠి, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. హైదరాబాదులో పేరొందిన వాణిజ్య ప్రాంతాలలో ఇదీ ఒకటి. దీనికి సమీపంలో కింగ్ కోఠి, రామ్ కోఠి అని రెండు ప్రాంతాలు ఉన్నాయి.
కోఠి రెసిడెన్సీ పేరుమీదుగా ఈ ప్రాంతానికి కోఠి అనే పేరు వచ్చింది. కోఠి అంటే భవనం అని అర్థం. ఈ ప్రాంతంలో, బ్రిటిష్ రెసిడెంటు జేమ్స్ అఖిలీస్ కర్క్‌పాట్రిక్ కు చెందిన విక్టోరియన్, కొరింథియన్ శైలిలో నిర్మించిన విలాసవంతమైన భవనం ఉంది. ఈ భవనాన్ని 1949లో ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాల ప్రాంగణంగా మార్చారు.[1][2]
వాస్తవానికి ఈ భవనం కమల్ ఖాన్, ఆ తరువాత నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు చెందినది. 1911లో నిజాం సింహాసనం అధిరోహించిన తరువాత, తన తండ్రి నివసించిన చౌమహల్లా పాలస్లో కాకుండా, ఈ భవనంలో నివసించాడు. అప్పుడు ప్యాలెస్ ప్రాప్యత గోడలపై "కెకె" అని చెక్కబడింది. అది రాజ నివాసికి నచ్చకపోవడంతో, భవనానికి "కింగ్ కోఠి" లేదా "కింగ్స్ మాన్షన్" అని పేరు పెట్టడంకోసం ఒక ఫర్మానా జారీచేశాడు.
పుస్తక, బట్టల, ఎలక్ట్రానిక్స్ మొదలైన వ్యాపారాలకు కోఠి ప్రాంతం పేరొందింది. ఇక్కడ అనేక రకాల పుస్తక దుకాణాలు ఉన్నాయి. కోఠిలోని బ్యాంక్ స్ట్రీట్, హైదరాబాదు నగరానికి ఆర్థిక కేంద్రంగా ఉంది. ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ స్టేట్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు వంటి జాతీయ, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. 2007, ఆగస్టు 25న బాంబు దాడులకు గురైన గోకుల్ చాట్ దుకాణం కోఠిలోనే ఉంది. ఈ కోఠికి సమీపంలోనే అబిడ్స్ అనే మరో వాణిజ్య ప్రాంతం కూడా ఉంది.
భారతదేశంలోని పురాతన వైద్య కళాశాలలలో ఒకటైన ఉస్మానియా వైద్య కళాశాల ఇక్కడ ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంస్థల తెలంగాణ శాఖలు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.[3]
ఇక్కడికి సమీపంలోనే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఉంది. భారతదేశంలోనే అతి పెద్దదైన ఈ బస్ స్టేషన్ నుండి రాష్ట్ర, దేశంలోని అన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఆంధ్ర బ్యాంకుకు ఎదురుగా ఉన్న మహిళా కళాశాల వద్ద సిటీ బస్సు టెర్మినస్ ఉంది.
మొదలైన ప్రాంతాలకు బస్సులు వెళ్తాయి.
ఇక్కడికి సమీపంలోని నాంపల్లిలో హైదరాబాద్ రైల్వే స్టేషను, కాచిగూడలో కాచిగూడ రైల్వేస్టేషను ఉన్నాయి. ఇక్కడ ఉస్మానియా వైద్య కళాశాల మెట్రో స్టేషను ఉంది.