కోరా కాగజ్ | |
---|---|
దర్శకత్వం | అనిల్ గంగూలీ |
రచన | ఎం.జి.హష్మత్ |
స్క్రీన్ ప్లే | సురేంద్ర శైలజ్ |
కథ | అశుతోష్ ముఖర్జీ |
దీనిపై ఆధారితం | సాత్ పాకే బంధా by అశుతోష్ ముఖర్జీ |
నిర్మాత | సనత్ కొఠారి |
తారాగణం | విజయ్ ఆనంద్ జయ భాదురి |
ఛాయాగ్రహణం | బిపిన్ గజ్జర్ |
కూర్పు | వామన్ భోంస్లే గురుదత్ షిరాలి |
సంగీతం | కల్యాణ్‌జీ- ఆనంద్‌జీ |
నిర్మాణ సంస్థ | శ్రీజి ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 10 మే 1974 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
కోరా కాగజ్ (అనువాదం ఖాళీ కాగితం) అనేది సనత్ కొఠారి నిర్మాతగా అనిల్ గంగూలీ దర్శకత్వం వహించిన 1974 భారతీయ హిందీ భాషా నాటకీయ చిత్రం. ఈ చిత్రంలో విజయ్ ఆనంద్, జయ భాదురి, ఎ. కె. హంగల్, అచలా సచ్‍దేవ్, దేవన్ వర్మ నటించారు. ఈ చిత్రానికి కళ్యాణ్ జీ ఆనంద్ జీ సంగీతం అందించారు. కిషోర్ కుమార్ ఆలపించిన "మేరా జీవన్ కోరా కాగజ్" ("నా జీవితం ఒక ఖాళీ కాగితం") అనే టైటిల్ పాట ప్రాచుర్యాన్ని పొందింది.
22వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో, ఇది ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం అవార్డును గెలుచుకోగా, లతా మంగేష్కర్ ఉత్తమ మహిళా నేపథ్య గాయని అవార్డును గెలుచుకుంది. అశుతోష్ ముఖోపాధ్యాయ రాసిన సాత్ పాకే బంధా అనే కథ ఆధారంగా అదే పేరుతో 1963లో బెంగాలీ భాషలో అజోయ్ కర్ దర్శకత్వంలో సుచిత్రా సేన్ నటించిన చిత్రానికి ఇది పునర్నిర్మాణం.[1][2] ఇదే మలయాళంలో "అర్చనా టీచర్" పేరుతో 1981లో పునర్నిర్మించబడింది,
ప్రొఫెసర్ సుకేశ్ దత్ (విజయ్ ఆనంద్), అర్చన గుప్తా (జయ బచ్చన్) ముంబైలో సిటీ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఒకరినొకరు అనుకోకుండా కలుసుకుంటారు. అర్చన తండ్రి సుకేష్‌ను ఇష్టపడతాడు. అర్చన, సుకేష్‌లు ఇద్దరూ కూడా ఒకరికొకరు ఆకర్షింపబడి వివాహం చేసుకుంటారు. అర్చన తల్లి సుకేష్ తక్కువ ఆదాయం కారణంగా అతన్ని ఇష్టపడదు. ఆమె తన అంతస్థు గురించి గొప్పలు చెప్పుతుంటుంది. ఇది సుకేష్‌ను బాధపెడుతుంది. ఆమె వారి జీవితంలో జోక్యం చేసుకుని వారి కోసం వస్తువులను కొనుగోలు చేస్తుంది. అది అతని అహంకారాన్ని దెబ్బతీస్తుంది. ఈ విషయాలన్నీ అర్చన, సుకేష్ మధ్య వైరానికి దారితీస్తాయి, వారు విడిపోవాలని నిర్ణయించుకుంటారు. అర్చన తన తల్లిదండ్రులతో కలిసి జీవించడానికి వెళుతుంది, సుకేష్ దూరంగా వెళ్ళిపోతాడు. అర్చన కుటుంబం ఆమెను సుకేష్‌ను మరచిపోయి, మళ్ళీ పెళ్ళి చేసుకోమని ఒత్తిడి తెస్తుంది. అయితే ఆమెకు ఇప్పటికీ సుకేష్ పట్ల ప్రేమ ఉన్నందున ఇది కష్టంగా అనిపిస్తుంది. ఆమె మనశ్శాంతి కోసం ఉపాధ్యాయురాలిగా పనిచేయడానికి సుదూర ప్రాంతానికి వెళుతుంది. ఒక రోజు సుకేష్, అర్చన రైల్వే వెయిటింగ్ రూములో అనుకోకుండా కలుస్తారు. అక్కడ వారు తమ అపార్థాలను, మనోవేదనలను పరిష్కరించుకుంటారు. ఆ తర్వాత వారు తిరిగి కలిసి సంతోషంగా జీవిస్తారు.
ఈ చిత్రంలోని పాటలన్నింటినీ ఎం. జి. హష్మత్ వ్రాశాడు.
పాట శీర్షిక | గాయకులు | నిడివి |
---|---|---|
"మేరా జీవన్ కోరా కాగజ్" | కిషోర్ కుమార్ | 3:35 |
"మేరా పఠనే మే నహీ లగే దిల్" | లతా మంగేష్కర్ | 3:01 |
"రూట్ రూట్ పియా" | లతా మంగేష్కర్ | 3:22 |
గెలుపొందినవి
ప్రతిపాదించబడినవి
బి.ఎఫ్.జె.ఎ. అవార్డులు :