నందిని | |
---|---|
![]() | |
జననం | కవిత 29 డిసెంబరు 1979[1] |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 1996 – 2010 2014 – ప్రస్తుతం |
తల్లిదండ్రులు | శివశంకరన్, పూర్ణిమ |
నందిని (జన్మనామం:కవిత) (1979 డిసెంబరు 29) భారతీయ సినిమా రంగంలో కౌసల్య గా సుపరిచితురాలు. ఆమె భారతీయ చలనచిత్ర నటి, మోడల్. దక్షిణాది సినిమా పరిశ్రమలో ప్రధాన కథానాయకిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆమె అనేక సహాయక పాత్రలను పోషించింది.
నందిని మొదట మోడలింగ్ ద్వరా తన కెరీర్ ను ప్రారంభించింది. 1996లో బాలచంద్రమీనన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ఏప్రిల్ 19 ద్వారా చిత్ర సీమలోకి ప్రవేశించింది. [2] [3] [4] తరువాత సంవత్సరంలో ఆమె తమిళ నటుడు మురళి తో కలసి తమిళ సినిమా కాలమెల్లం కాదల్ వాజ్గా లో నటించింది. తరువాత తమిళంలో విజయవంతమైన సినిమాలైన నెరుక్కు నేర్ (1997), ప్రియముదన్ (1998), సొల్లమాలె (1998), పూవెలి (1998), వానతయిప్పోల (2000) లలో నటించింది. మలయాళంలో ఆమె మోహన్ లాల్ కు వ్యతిరేకంగా అయాల్ కధ ఎఝుతుకయను (1998) లో నటించి గుర్తింపు పొందింది. ఆమె మలయాళంలో కళాభవన్ మణి తో కలసి కరుమదికుట్టన్ (2001) సినిమాలో నటించింది.
ఆమె సుమారు 30 తమిళ, మలయాళ భాషా చిత్రాలలో ముఖ్య పాత్రలలో నటించింది. తమిళ సినిమా పూవెలి లో ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా తమిళంలో ఫిలిం ఫేర్ పురస్కారాన్ని పొందింది. ఆమె ఎక్కువగా చీర ధరించిన సాంప్రదాయక పాత్రలలొ నటించింది. 2000 నాటికి ఆమె క్యారక్టర్ ఆర్టిస్టుగా మారి తిరుమలై (2003), సంతోష్ సుబ్రహ్మణ్యం (2008) చిత్రాలలో సహాయ నటిగా నటించింది. ఆమె సన్ టీవీ లో 436 ఎపిసోడ్లు ప్రసారం చేయబడిన "మనైవి" సిరీస్ ద్వారా టెలివిజన్ కార్యక్రమాల వైపు అడుగుపెట్టింది. [5]
2004 లో, ఆమె ప్రధాన పాత్రలలో నటిగా నటించడానికి తిరిగి ప్రయత్నించింది. కానీ దురదృష్టవశాత్తూ ఆమె చేసిన అనేక ప్రాజెక్టులు ఆలస్యం అయ్యాయి. ఆమె ప్రశాంత్ తొ కలసి నటించిన తంగరాజన్ దర్శకత్వంలోని "పోలీస్" సినిమా, కార్తీక్ తో నటించిన "మనధిల్", వెండుమది నీ ఎనక్కు, రోసప్పూ చిన్న రోసప్పూ చిత్రాలు తయారైనా వెంటనే నిలిచిపోయాయి. [6]
నందిని 1979 డిసెంబరు 3న శివశంకరన్, పూర్ణిమ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో అధికారి. ఆమె సోదరుడు షణ్ముఘ వ్యాపారవేత్త. [7] ఆమె అవివాహితురాలు. [8]
సంవత్సరం | చిత్రం | పాత్ర | భాష | వివరణ |
---|---|---|---|---|
1999 | అల్లుడుగారు వచ్చారు | మహలక్ష్మి | తెలుగు | |
1999 | పంచదార చిలక | కళ్యాణి | తెలుగు | |
2004 | గౌరి | నాగలక్ష్మి | తెలుగు | |
2005 | మహా నది (సినిమా) | మిసెస్ స్వామి | తెలుగు | |
2007 | వియ్యాలవారి కయ్యాలు (2007 సినిమా) | భూపతి రాయుడు భార్య | తెలుగు | |
2010 | రాంబాబు గాడి పెళ్ళాం | తెలుగు | ||
2017 | రారండోయ్ వేడుక చూద్దాం | గీత | తెలుగు | |
2018 | సవ్యసాచి | మహలక్ష్మి | తెలుగు | |
2019 | 4 లెటర్స్ | తెలుగు | ||
2020 | రన్ | ఊహాత్మక వైద్యురాలు | తెలుగు | |
2021 | రంగ్ దే | అర్జున్ తల్లి | తెలుగు | |
2024 | పురుషోత్తముడు |
సంవత్సరం | శీర్షిక | పాత్ర | ఛానల్ | భాష |
---|---|---|---|---|
2004-2006 | మనైవి | హంసేవేని / కృష్ణవేణి | సన్ టీవీ | తమిళం |
2004-2004 | చిట్టా | హేమ / తత్త | సూర్య టీవీ | మలయాళం |
2006 | తనిచు | దేవప్రియ రామన్ IAS / దేవట్టి | ఆసియానెట్ | |
అమ్మే నమస్తుతే | భక్తి ఆల్బమ్ | |||
2008 | కందెన్ సీతయ్యై | స్టార్ విజయ్ | తమిళం | |
2010 | ధర్మయుధం | మెగా టీవీ | ||
2010 | అలైపాయుతే | జయ టీవీ | ||
2014–2015 | అక్కా | మణిమేఘలై | జయ టీవీ | |
2015 | స్పంధనం | అన్నీ | సూర్య టీవీ | మలయాళం |
2016-2017 | అమ్మ | సుకన్య | సువర్ణ టీవీ | కన్నడ |