క్రిమినల్ (1994 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | మహేష్ భట్ |
తారాగణం | అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కొయిరాలా |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | క్రియేటివ్ కమర్షియల్స్ |
భాష | తెలుగు |
క్రిమినల్ 1994లో మహేశ్ భట్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కొయిరాలా ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె. ఎస్. రామారావు నిర్మించాడు. కీరవాణి స్వరాలు సమకూర్చాడు. తెలుసా మనసా అనే పాట ప్రజాదరణ పొందినది. ఆంగ్ల చిత్రం The Fugitive చిత్రం ఆధారంగా, ఈ చిత్రం నిర్మించబడినది.[1] ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తీశారు. తెలుగులో చెప్పుకోదగ్గ విజయం సాధించినా హిందీలో మాత్రం పర్వాలేదనిపించింది.[2]