![]() | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | క్రిస్టోఫర్ లాన్స్ కెయిర్న్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | పిక్టన్, న్యూజీలాండ్ | 1970 జూన్ 13|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 2 అం. (1.88 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ బౌలింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | లాన్స్ కెయిర్న్స్ (తండ్రి) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 168) | 1989 24 November - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2004 13 June - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 76) | 1991 13 February - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2006 8 January - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 6 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I | 2005 17 February - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2006 16 February - West Indies తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1988–2008 | Nottinghamshire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1988/89 | Northern Districts | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1990/91–2005/06 | Canterbury | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2008 26 November |
క్రిస్టోఫర్ లాన్స్ కెయిర్న్స్ (జననం 1970, జూన్ 13) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, మాజీ వన్డే కెప్టెన్. న్యూజీలాండ్ క్రికెట్ జట్టుకు ఆల్ రౌండర్‌గా రాణించాడు. సదరన్ కాన్ఫరెన్స్ క్రికెట్ జట్టు తరపున దేశీయ క్రికెట్ ఆడాడు.
తన టెస్ట్ కెరీర్‌ను 33.53 బ్యాటింగ్ సగటు, 29.40 బౌలింగ్ సగటుతో ముగించాడు. 2000లో ఐదుగురు విజ్డెన్ క్రికెటర్లలో ఒకరిగా ఎంపికయ్యాడు. 1992, 1996, 1999, 2003లో ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించాడు. క్రికెట్ గొప్ప ఆల్‌రౌండర్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు.[1] 2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీని గెలుచుకున్న న్యూజీలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ ట్రోఫీ ఫైనల్‌లో 102 నాటౌట్‌తో నిలిచాడు.
ఇతను న్యూజీలాండ్ మాజీ క్రికెటర్ లాన్స్ కెయిర్న్స్ కుమారుడు. వన్డే, టెస్ట్ న్యూజీలాండ్ జట్లు రెండింటిలోనూ, అలాగే కాంటర్‌బరీ న్యూజీలాండ్ దేశీయ ఛాంపియన్‌షిప్ జట్టులోనూ ఆడాడు. ఆట నుండి విరమణ పొందిన తరువాత కెయిర్న్స్ స్కై స్పోర్ట్ న్యూజీలాండ్‌తో వ్యాఖ్యాతగా మారాడు.
1988 యూత్ క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజీలాండ్ జాతీయ అండర్-19 క్రికెట్ జట్టులో ఎంపికయ్యాడు. ఇది అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభ ఎడిషన్.[2] ఆ తర్వాత సీనియర్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 1989, నవంబరు 24న ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు.[3]
కెయిర్న్స్ 2004లో న్యూజీలాండ్ టెస్ట్ జట్టు నుండి రిటైర్ అయ్యాడు.[4]