వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | క్రిస్టొఫర్ బ్లెయిర్ గఫానీ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | డునెడిన్, న్యూజీలాండ్ | 30 నవంబరు 1975|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటరు | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1995/96–2006/07 | ఒటాగో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి ఫక్లా | 17 January 1996 Otago - ఆక్లండ్ | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి ఫక్లా | 20 March 2005 Otago - వెల్లింగ్టన్ | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి లిఎ | 26 November 1995 Otago - Wellington | |||||||||||||||||||||||||||||||||||||||
Last లిఎ | 10 February 2007 Otago - Auckland | |||||||||||||||||||||||||||||||||||||||
అంపైరుగా | ||||||||||||||||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన టెస్టులు | 49 (2014–2023) | |||||||||||||||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన వన్‌డేలు | 77 (2010–2022) | |||||||||||||||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన టి20Is | 43 (2010–2022) | |||||||||||||||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన మవన్‌డేలు | 3 (2008) | |||||||||||||||||||||||||||||||||||||||
అంపైరింగు చేసిన మటి20Is | 5 (2010–2016) | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 7 June 2023 |
క్రిస్టోఫర్ బ్లెయిర్ గఫానీ (జననం 1975 నవంబరు 30) ఒటాగో తరపున ఆడిన న్యూజిలాండ్ మాజీ క్రికెటరు, కుడిచేతి వాటం బ్యాటరు. అతను 83 ఫస్ట్-క్లాస్, 113 లిస్టు A మ్యాచ్‌లలో ఆడాడు. ప్రస్తుతం అతను అంతర్జాతీయ అంపైర్‌గా పనిచేస్తున్నాడు. గఫానీ ప్రస్తుతం ఐసిసి ఎలైట్ అంపైర్ ప్యానెల్‌లో సభ్యుడు. టెస్టులు, వన్ డే ఇంటర్నేషనల్స్, ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో అఫీషియల్‌గా ఉన్నాడు.
2010 సెప్టెంబరులో టొరంటోలో కెనడా, ఐర్లాండ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గాఫానీ తన వన్‌డే అంపైరింగు మొదలు పెట్టాడు. ఐసిసి అంతర్జాతీయ అంపైర్ల ప్యానెల్‌లో అంపైర్‌గా పనిచేశాడు. 2014 ఆగస్టులో హరారేలో జింబాబ్వే, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన మ్యాచ్‌తో తన టెస్టు మ్యాచ్ అంపైరింగు మొదలుపెట్టాడు.
ఆ తర్వాత 2015 క్రికెట్ ప్రపంచ కప్‌లో మ్యాచ్‌లలో నిలిచిన ఇరవై మంది అంపైర్‌లలో ఒకరిగా గఫానీ ఎంపికయ్యాడు. టోర్నమెంటు సమయంలో ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా మూడు మ్యాచ్‌లలో నిలిచాడు. [1] కొన్ని నెలల తర్వాత అతను తన అనేక స్థిరమైన ప్రదర్శనల ఫలితంగా 2015-16 కొరకు ఐసిసి ఎలైట్ అంపైర్ ప్యానెల్‌కు ఎలివేటయ్యాడు. [2]
2019 ఏప్రిల్‌లో అతను, 2019 క్రికెట్ ప్రపంచ కప్‌లో మ్యాచ్‌లలో నిలిచిన పదహారు అంపైర్‌లలో ఒకడిగా స్థానం పొందాడు. [3] [4]
2020 సెప్టెంబరులో, అతను 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్‌లలో పనిచేసిన పదిహేను మంది అంపైర్‌లలో ఒకరిగా ఎంపికయ్యాడు. ఫైనల్‌లో కూడా నిలిచాడు.