మిషన్ రకం | సాంకేతికత |
---|---|
ఆపరేటర్ | ఇస్రో |
మిషన్ వ్యవధి | 20 నిముషాలు |
పరిథి | 1,600 కిలోమీటర్లు (990 మై.) |
అపోజీ | 126 కిలోమీటర్లు (78 మై.) |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
తయారీదారుడు | ఇస్రో |
లాంచ్ ద్రవ్యరాశి | 3,735 కిలోగ్రాములు (8,234 పౌ.) |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | 18 December 2014, 04:00 | UTC
రాకెట్ | ఎల్‌విఎమ్3 |
లాంచ్ సైట్ | సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం |
కాంట్రాక్టర్ | ఇస్రో |
మిషన్ ముగింపు | |
ల్యాండింగ్ తేదీ | 18 December 2014, 04:15 | UTC
ల్యాండింగ్ ప్రదేశం | బంగాళాఖాతం |
క్రూ మాడ్యూలు వాతావరణ పునఃప్రవేశ ప్రయోగం (The Crew Module Atmospheric Re-entry Experiment -CARE) భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ వారి కక్ష్యా వాహనం యొక్క ప్రయోగాత్మక పరీక్షా వాహనం. 2014 డిసెంబరు 8 న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఎల్‌విఎమ్3 రాకెట్టు ద్వారా దాన్ని విజయవంతంగా ప్రయోగించారు.[1][2]
క్రూ మాడ్యూలు ఇస్రో తలపెట్టిన మానవ సహిత యాత్రలో ఉపయోగించే గగన్‌యాన్లోని ఒక భాగం.[3] గగన్‌యాన్‌లో రెండు మాడ్యూళ్ళుంటాయి - క్రూ మాడ్యూలు, సర్వీసు మాడ్యూలు. క్రూ మాడ్యూల్లో వ్యోమనాట్లు ప్రయాణిస్తారు.
కేర్‌ను జిఎస్‌ఎల్‌వి మార్క్3 పేలోడ్ ఫెయిరింగులో తల్లకిందులుగా అమర్చారు. అది అల్యూమినియం మిశ్రమంతో తయారైంది. పైకి లేచేటపుడు దాని బరువు 3,735 కిలోలు. దాని వ్యాసం 3100 మిమీ, ఎత్తు 2678 మిమీ. మాడ్యూలుకు ఊడదీయగలిగే ఉష్ణ కవచపు తొడుగు ఉంది. ఈ తొడుగు పార్శ్వాల్లో మధ్యమ సాంద్రత కలిగిన పలకలు ఉండగా, ముందు వైపున కార్బన్ ఫెనాలిక్ ఫలకాలను అమర్చారు. దానికి బ్యాటరీల నుండి పవరు వస్తుంది. 100 న్యూటన్ల థ్రస్టును ఇచ్చే 6 ద్రవ ఇంధన థ్రస్టర్లు కూడా దానికి అమర్చారు.
మాడ్యూలు రికవరీ విధానాన్ని 2014 అక్టోబరు 31 న ప్రయోగాత్మకంగా జరిపారు. ఇందులో భారతీయ తీర రక్షక దళపు సముద్ర పహ్రీదార్ నౌక పాల్గొంది.[4]
మాడ్యూలును 2014 డిసెంబరు 18 న ఉదయం 9:30 కు ఎల్‌విఎమ్3 ద్వారా ప్రయోగించారు. 126 కి.మీ.ఎత్తున 5.3 కిమీ/సె వేగం వద్ద మాడ్యూలు విడిపోయింది. కొంతసేపు అదే వేగంతో ప్రయాణించింది. ఈ దశలో మూడు అక్షాల నియంత్రణ మెనూవర్లు జరిపి పునఃప్రవేశ సమయంలో యాంగిల్ ఆఫ్ ఎటాక్ సున్నా డిగ్రీలు ఉండేలా జాగ్రత్త తీసుకుంది.
80 కి.మీ.ఎత్తున బాలిస్టిక్ పథంలో పునఃప్రవేశం మొదలైంది. ఈ ఎత్తులో చోదనం ఆపేసారు. ఉష్ణ కవచం 1,000 డిగ్రీ C ఉష్ణోగ్రతకు గురైంది. మాడ్యూలు 13 g వరకూ త్వరణాన్ని (వ్యతిరేక త్వరణం) చవి చూసింది.[5]
పునఃప్రవేశం తరువాత మాడ్యూలు అవనతమౌతూ, నీటిలో పడే వరకూ పారాచూట్ వ్యవస్థ ఆమూలాగ్రం పరీక్షలకు గురైంది. అపెక్స్ కవరు విడిపోవడం, క్లస్టరుగా పారాచూట్లు తెరుచుకోవడం వంటివి కూడా ఈ పరీక్షల్లో ఉన్నాయి. మాడ్యూలు వేగం 233 మీ/సె కు తగ్గినపుడు పారాచూట్లు తెరుచుకోవడం మొదలైంది. క్రూ మాడ్యూల్లో మూడు రకాల పారాచూట్లున్నాయి. అవన్నీ జతలుగా ఉన్నాయి. ముందుగా, 2.3 మీ వ్యాసం గల పైలట్ పారాచూట్ జత తెరుచుకుంది. ఆ తరువాత 6.2 మీ డ్రోగ్ పారాచూట్లు తెరుచుకున్నాయి. దీనితో మాడ్యూలు వేగం 50 మీ/సె కు తగ్గింది. 5 కి.మీ.ఎత్తున ప్రధాన పారాచూట్ల జత తెరుచుకున్నాయి. ఒక్కొక్కటి 31 మీ వ్యాసం గల ఈ పారాచూట్లు భారత్‌లో తయారైన వాటిలో అతి పెద్దవి.[6]
బంగాళాఖాతంలో పోర్ట్‌బ్లెయిర్‌కు 600 కి.మీ., శ్రీహరికోట నుండి 1600 కి.మీ.దూరంలో కేర్ మాడ్యూలు దిగింది.[7] ఆ వెంటనే ప్రధాన పారాచూట్లను తొలగించుకుంది. మాడ్యూలులోని సిగ్నలును వెతుక్కుంటూ భారతీయ తీర రక్షక దళం దాన్ని చేరుకుంది. పైకి లేచినప్పటి నుండి, నీటిలో దూకే దాకా మొత్తం ప్రయోగానికి 20 నిముషాల 43 సెకండ్లు సమయం పట్టింది.[8]
రికవరీ చేసిన మాడ్యూలును 2014 డిసెంబరు 22 న చెన్నైకి తీసుకువచ్చారు. అక్కడి నుండి శ్రీహరికోటకు పంపి ప్రాథమిక పరీక్షలు చేస్తారు.[9] ఆ తరువాత మరిన్ని పరిశీలనల కోసం దాన్ని విక్రం సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి పంపిస్తారు.[9]
దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారంలో కింది టెలిమెట్రీ డేటా కనిపించింది:[10]
సమయం (సెకండ్లు) | ఘటన | గమనింపులు |
---|---|---|
0.1 | S200 జ్వలనం | భూమిపై మండడం మొదలయ్యే 2 స్ట్రాపాన్ ఘన బూస్టర్లు |
120 | L110 జ్వలనం | గాలిలో మండడం మొదలయ్యే L110 ద్రవ ఇంధన కోర్ |
153.5 | S200 విడిపోవడం | 2 ఘన బూస్టర్లు విడిపోవడం |
163.4 | CLG మొదలైంది | CLG = Closed-Loop Guidance |
237.2 | ఉష్ణ కవచం విడిపోయింది | సాధారణం |
324.6 | L110 ఆగింది | సాధారణం: సాపేక్ష వేగం 4.92 కిమీ/సె, రేంజి 565.6 కిమీ, ఎత్తు 125.6 కిమీ, అజిముత్ 121.1 డిగ్రీలు |
325.7 | L110 విడిపోయింది | సాధారణం: సాపేక్ష వేగం 4.95 కిమీ/సె, రేంజి 570.5 కిమీ, ఎత్తు 125.4 కిమీ, అజిముత్ 121.1 డిగ్రీలు |
330.8 | CARE మాడ్యూలు విడిపోయింది | సాధారణం: సాపేక్ష వేగం 4.96 కిమీ/సె, రేంజి 599.5 కిమీ, ఎత్తు 125.1 కిమీ, అజిముత్ 121.1 డిగ్రీలు |
341.0 | CARE మాడ్యూలు CLG మొదలైంది | సాధారణం: సాపేక్ష వేగం 4.96 కిమీ/సె, రేంజి 633.1 కిమీ, ఎత్తు 125.2 కిమీ, అజిముత్ 121.1 డిగ్రీలు |
385.5 | బాలిస్టిక్ పథంలో CARE మాడ్యూలు దిగుతోంది | సాధారణం: సాపేక్ష వేగం 4.93 కిమీ/సె, రేంజి 858.8 కిమీ, ఎత్తు 116.6 కిమీ, అజిముత్ 121.0 డిగ్రీలు |
399.5 | బాలిస్టిక్ పథంలో CARE మాడ్యూలు దిగుతోంది | సాధారణం: సాపేక్ష వేగం 4.94 కిమీ/సె, రేంజి 926.6 కిమీ, ఎత్తు 111.8 కిమీ, అజిముత్ 121.0 డిగ్రీలు |
419.5 | బాలిస్టిక్ పథంలో CARE మాడ్యూలు దిగుతోంది | సాధారణం: సాపేక్ష వేగం 4.96 కిమీ/సె, రేంజి 1023.5 కిమీ, ఎత్తు 103.1 కిమీ, అజిముత్ 121.0 డిగ్రీలు |
440.5 | బాలిస్టిక్ పథంలో CARE మాడ్యూలు దిగుతోంది | సాధారణం: సాపేక్ష వేగం 4.98 కిమీ/సె, రేంజి 1125.6 కిమీ, ఎత్తు 91.8 కిమీ, అజిముత్ 121.0 డిగ్రీలు |
460.6 | CARE మాడ్యూలు పునఃప్రవేశం | సాధారణం |
468.5 | బాలిస్టిక్ పథంలో CARE మాడ్యూలు దిగుతోంది | సాధారణం: సాపేక్ష వేగం 5.00 కిమీ/సె, రేంజి 1262.4 కిమీ, ఎత్తు 73.3 కిమీ, అజిముత్ 121.0 డిగ్రీలు |
573.0 | CARE మాడ్యూలు దిగుతోంది | సాధారణం: సాపేక్ష వేగం 0.244 కిమీ/సె, రేంజి 1534.5 కిమీ, ఎత్తు 18.1 కిమీ |
584.0 | CARE మాడ్యూలు 15.5 కి.మీ.ఎత్తున | సాధారణం: సాపేక్ష వేగం 0.210 కిమీ/సె, రేంజి 1535.6 కిమీ, ఎత్తు 15.9 కిమీ |
584.3 | APEX కవరు విడిపోయింది | సాధారణం |
584.5 | CARE మాడ్యూలు దిగుతోంది | సాధారణం: సాపేక్ష వేగం 0.209 కిమీ/సె, రేంజి 1535.7 కిమీ, ఎత్తు 15.8 కిమీ |
589.4 | పైలట్ పారాచూట్ తెరుచుకుంది | సాధారణం |
596 | CARE మాడ్యూలు దిగుతోంది | సాధారణం: సాపేక్ష వేగం 0.086 కిమీ/సె, రేంజి 1536.0 కిమీ, ఎత్తు 14.2 కిమీ |
740.6 | CARE మాడ్యూలు 5 కి.మీ.ఎత్తున ఉంది | సాధారణం |
741.4 | ప్రధాన పారాచూట్ తెరుచుకుంది | CARE మాడ్యూలు దిగే వేగం నీటిని తాకే ముందు విపరీతంగా పెరిగిపోయింది |
751.0 | CARE మాడ్యూలు దిగుతోంది | చూపించిన టెలిమెట్రీ: సాపేక్ష వేగం 0.431 కిమీ/సె, రేంజి 1508.2 కిమీ, ఎత్తు 0.9 కిమీ |
755.0 | CARE మాడ్యూలు దిగుతోంది | చూపించిన టెలిమెట్రీ: సాపేక్ష వేగం 0.443 కిమీ/సె, రేంజి 1506.6 కిమీ, ఎత్తు 0.6 కిమీ |
760.0 | CARE మాడ్యూలు దిగుతోంది | చూపించిన టెలిమెట్రీ: సాపేక్ష వేగం 0.459 కిమీ/సె, రేంజి 1504.7 కిమీ, ఎత్తు 0.1 కిమీ |
761.0 | CARE మాడ్యూలు దిగుతోంది | చూపించిన టెలిమెట్రీ: సాపేక్ష వేగం 0.462 కిమీ/సె, రేంజి 1504.3 కిమీ, ఎత్తు 0.0 కిమీ |
779.0 | CARE మాడ్యూలు దిగుతోంది | చూపించిన టెలిమెట్రీ: సాపేక్ష వేగం 0.518 కిమీ/సె, రేంజి 1496.7 కిమీ, ఎత్తు -1.7 కిమీ |
833.0 | CARE మాడ్యూలు దిగుతోంది | చూపించిన టెలిమెట్రీ: సాపేక్ష వేగం 0.689 కిమీ/సె, రేంజి 1468.7 కిమీ, ఎత్తు -7.8 కిమీ |
940.0 | CARE మాడ్యూలు దిగుతోంది | అంతిమంగా చూపించిన టెలిమెట్రీ: సాపేక్ష వేగం 1.014 కిమీ/సె, రేంజి 1406.3 కిమీ, ఎత్తు -21.0 కిమీ |